గుత్తి ( జనస్వరం ) : మున్సిపాలిటీ పరిధిలోని చెట్నేపల్లి పంచాయతీ జనావాసం ఎక్కువ ఉన్న ప్రదేశంలో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తున్న సెల్ టవర్ ను తొలగించాలని స్థానికుల తిరుగుబాటుతో న్యాయ పోరాడడానికి దిగిన జనసేన పార్టీ. ఈ సందర్భంగా కాలనీవాసులు, జనసేన పార్టీ గుంతకల్ నియోజకవర్గం సమన్వయభాద్యుడు వాసగిరి మణికంఠ మాట్లాడుతూ జనావాసం ఎక్కువ ఉన్న ప్రదేశం లో ముఖ్యంగా ప్రజల నుండి వ్యతిరేకత ఉంటే సెల్ ఫోన్ టవర్ ఏర్పాటు చేయకూడదు అని నిబంధనలు స్పష్టంగా ఉన్న అవన్నీ బేఖాదర్ చేస్తూ టవర్ ఏర్పాటు చేయడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. స్థానిక ప్రజలు సంబంధిత అధికారులకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్న, న్యాయపోరాటం చేసిన గోడు వినలేదని ఆ కాలనీ ప్రజలు ఆవేదన చెందుతున్నారు, ప్రధానంగా టవర్ ఏర్పాటు చేయడం వలన మనిషి మనుగడకు సంబంధించి రకరకాల రోగాల బారిన పడతారని అనేకమంది డాక్టర్లు చెబుతున్న వాటన్నిటినీ పెడచెవిన పెడుతూ దౌర్జన్యంగా ఏర్పాటు చేస్తున్న టవర్ ను వెంటనే నిలిపివేయాలని సంబంధిత మున్సిపల్ కమిషనర్ తెలియజేశాం, త్వరలో విచారణ చేపట్టి టవర్ నిర్మాణాన్ని నిలిపివేయాలి. లేని పక్షంలో స్థానికుల సహకారంతో జనసేన పార్టీ ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాలనీవాసులు మరియు గుత్తి మండల, పట్టణ అధ్యక్షులు చిన్న వెంకటేశులు, పాటిల్ సురేష్, ఇంకా హేమంత్, అఖండ భాష, మధు, వెంకటేష్ గాలి, పర్సి జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యుడు పవర్ శేఖర్, ఆటో రామకృష్ణ, కాపు సంక్షేమ సేన నాయకులు సుబ్బయ్య, బుర్ర అఖిల్, కసాపురం నందా, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com