పిఠాపురం ( జనస్వరం ) : పి. ఎస్. ఎన్. మూర్తి పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం కొండెవరం దళిత కాలనీలో తీవ్ర తుఫాను తాకిడికి నిలువ నీడలేక, ఆహారం అందక పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ చలించిపోయారు. ఎప్పుడు విపత్తు వచ్చినా సాయం చేయడంలో ముందుండే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ తంగళ్ళ ఉదయ్ శ్రీనివాస్, పి.ఎస్.ఎన్ మూర్తి ఈ సారి కూడా తమ వంతు సాయానికి 700 మందికి అన్నదానం చేయడానికి ముందుకు వచ్చారు, సాధ్యమైనంత త్వరగా చేతనైన సాయంతో ఊరట కల్పించారు. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు బాధల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి ముందుకు రావాలని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పిండి శ్రీనువాస్, కసిరెడ్డి నాగేశ్వరావు. కోలా దుర్గాదేవి, పబ్బిరెడ్డి, భీమేశ్వరావు మల్లం బీసీ నాయకులు వై శ్రీనువాస్, తోట సతీష్, పెంకే జగదీష్, నామ శ్రీకాంత్, గొల్లప్రోలు సారధి తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com