అనంతపురము, జనవరి 28, (జనస్వరం) : కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రం మండలం కోనాపురం గ్రామంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం పండుగ వాతావరణంలో అంగరంగ వైభవంగా జరిగింది. జనసేన పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జనసేన జిల్లా అధ్యక్షుడు, అహుడ చైర్మన్ టి.సి.వరుణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామం మొత్తం జనసేన జెండాలు, నినాదాలతో కిక్కిరిసిపోయింది. భారీ సంఖ్యలో హాజరైన జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు, అభిమానులు మరియు గ్రామ ప్రజలతో కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. టి.సి.వరుణ్‌కు జనసైన్యం ఘన స్వాగతం పలికింది. పూల వర్షం కురిపిస్తూ కార్యకర్తలు, అభిమానులు స్వాగతం తెలపగా, వీరమహిళలు మంగళ హారతులతో ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సభలో మాట్లాడిన టి.సి.వరుణ్ గ్రామీణ స్థాయి నుంచే పార్టీని బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. జనసేన అధినేత, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో రాజకీయాలకు అతీతంగా సంక్షేమ, అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందిస్తున్న కూటమి ప్రభుత్వం విధానాలను వివరించారు. అభివృద్ధిని వికేంద్రీకరణ చేస్తూ ప్రతి గ్రామానికి న్యాయం జరిగేలా పనిచేస్తామని తెలిపారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా కార్యకర్తగా ముందుండి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఆయన ప్రసంగం కార్యకర్తలను ఉత్సాహపరిచింది. కళ్యాణదుర్గం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బాల్యం రాజేష్ ఆధ్వర్యంలో జై జనసేన, పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి, టి.సి.వరుణ్ నాయకత్వం వర్ధిల్లాలి అనే నినాదాలతో కోనాపురం గ్రామం మార్మోగింది. అనంతరం జనస్వరం 2026 నూతన క్యాలెండర్‌ను టి.సి.వరుణ్ చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కమిటీ నాయకులు, ప్రభుత్వ డైరెక్టర్లు, నియోజకవర్గ, మండల నాయకులు, మండలాల అధ్యక్షులు, వీరమహిళలు, జనసైనికులు, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.