
మదనపల్లి ( జనస్వరం ) : మదనపల్లి నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవడం లక్ష్యంగా నేను మదనపల్లె రూరల్ కాశీరావుపేట నందు ఉన్న ఆంజనేయస్వామి గుడి దగ్గర నుంచి ప్రారంభించిన జనం కోసమే జనసేన పాదయాత్ర ఈరోజు తో 75 వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా జనసేన పార్టీ చంద్ర కాలనీ నాయకులు అప్సర్, శమీ ఆధ్వర్యంలో 75 రోజులకు పురస్కరించుకొని కేక్ కట్ చేసి సంబరాలు చేసుకొని పాదయాత్ర ఇంటింటికి జనసేన సిద్ధాంతాలు తెలియజేయడం జరిగింది. గడచిన 75 రోజులుగా మదనపల్లి నియోజకవర్గంలోని ముఖ్యంగా మదనపల్లి రూరల్ ప్రాంతంలోని పల్లెలన్నీ తిరిగి ఆ పల్లెల సమస్యలు ఆయా సచివాలయాల్లో మండల ఆఫీసులో కుంకివారిపల్లి రోడ్డు సమస్య గురించి పంచాయతీరాజ్ అధికారులు గానీ సబ్ కలెక్టర్ ఆఫీస్ నందు గాని ఎన్నో సమస్యలపై వినతులిచ్చి మేము ఈ జనం కోసమే జనసేన పాదయాత్రలో ఎత్తి చూపిన సమస్యలు ఎన్నో పరిష్కరించబడ్డాయి. ఇంకెన్నో అధికారుల దృష్టి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి దీనిపైన మరింత స్థాయిలో ఉద్యమం చేసే విధంగా మా కార్యాచరణ చేపట్టబోతున్నామని అన్నారు. మదనపల్లి మున్సిపాలిటీ బికేపల్లి సంబంధించి కాలువలు రోడ్లు తాగునీటి వ్యవస్థలేనందున దాని గురించి కూడా సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అలాగే మున్సిపాలిటీ స్పందన కార్యక్రమంలో కమిషనర్ గారికి కూడా ఈ సమస్యల గురించి వినతిపత్రం అందజేసి 20 రోజుల్లోగా తగు చర్యలు తీసుకోకపోతే కచ్చితంగా నిరసన దీక్షలు చేపడతామని కూడా తెలియజేయడం అందరికి విదితమే అలాగే ఈ 75 రోజుల్లో ఎంతోమంది ముఖ్యంగా ఒంటరి మహిళలకు వృద్ధులకు వికలాంగులకు ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ 75 రోజుల జనం కోసమే జనసేన పాదయాత్రకు సహకరించి పాదయాత్రలో పాల్గొన్న ప్రతి జన సైనికుడికి వీర మహిళలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు. అలాగే మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు వాళ్ళు చూపించిన ఆధార అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ పాదయాత్రనిలాగే మదనపల్లి నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వెళ్లే వరకు ప్రజల తరఫున పోరాడి పూర్తి చేస్తానని తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు రామ్మూర్తి, సిద్దయ్య, సుభాష్, దిసుజా, శ్రీనాథ్, పవన్, నరేష్, ఆయాజ్, జాఫర్, జనసేన పార్టీ వీర మహిళలు మల్లికా, శోభ, రూప, సునీత, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.