
పాయకరావుపేట ( జనస్వరం ) : పాయకరావుపేట మండలం మంగవరం గ్రామస్థుడు బోడపాటి శ్రీను ఇళ్లు అగ్నిప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది. అంతేకాకుండా ఇంటి యజమాని అయిన శ్రీను కొన్ని రోజుల క్రితమే మరణించారు. ఈ విషయం గ్రామ జనసైనికులు జనసేన పార్టీ సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి తెలియజేయడంతో శోకసంద్రంలో బాధపడుతున్న వాల్ల భార్యను పిల్లల్ని ఓదార్చి మీకు నేను అండగా ఉంటానని హామీ ఇచ్చి బియ్యం బస్తాలు, రెండు నెలలు సరిపడ నిత్యావసర సరుకులు, 5000 నగదు ఇచ్చి దైర్యం చెప్పారు. మంగవరం జనసేన నాయకులు కట్టా దొరబాబు ఆ కుటుంబానికి తన వంతుగా 3 బియ్యం బస్తాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు గెడ్డం చైతన్య, జగ్గన్నదొర, పల్లి దుర్గారావు, వైస్ ప్రెసిడెంట్ శ్రీను మామిడి వెంకటరమణ, కట్టా నరసయ్య జనసైనికులు పాల్గొన్నారు.