రాయచోటి ( జనస్వరం ) : రాయచోటి, సుండుపల్లి మధ్య అటవీ ప్రాంతంలో అనుమతి ఉన్న కూడా రెండు వరసల రోడ్డు విస్తీర్ణం పనులు చేయకుండా ఎందుకు? వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని జనసేనపార్టీ నాయకుడు రామ శ్రీనివాస్ ఘాటుగా విమర్శించారు. రాయచోటి నుండి సుండుపల్లి వయా రాయవరం, పింఛ వెళ్ళే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న జనసేన నాయకులు. ఈ సందర్భంగా జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇరుకుగా ఉన్న సిబ్యాల మరియు అనుంపల్లి సంబంధించిన అటవీ ప్రాంతాల్లో 2 వరసల వెడల్పు రోడ్డు చేయాలని వైసీపీ ప్రభుత్వన్ని నిలదీస్తూ పాలక పక్షం ప్రజాప్రతినిధులు అలసత్వం వీడి తక్షణమే ఇరుకుగా ఉన్న రోడ్డును రెండు వరసల విస్తీర్ణ రోడ్డుకు యుద్ధప్రాతిపదికన మఱమ్మతులు చెయ్యాలని వైసీపీ పాలకులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గణేష్, దినేష్, కొండయ్య, రవీంద్ర, మైనార్టీ నేతలు ఖాదర్ భాష, రహిమ్ భాష, రియాజ్, మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com