హైదారాబాద్ ( జనస్వరం ) : గత కొద్ది రోజులుగా బీరంగూడ కమాన్ నుంచి కృష్ణారెడ్డి పేట వెళ్లే దారిలో రాత్రి పూట స్ట్రీట్ లైట్స్ ఆన్ చేయట్లేదు కానీ Advertisement Hoarding boards కి సంబంధించిన లైట్స్ మాత్రం ఎప్పుడు ఆన్ చేసి ఉంటున్నాయి. స్ట్రీట్ లైట్స్ ఆన్ చేయకపోవడం వలన బైక్స్ మీద, కాలినడకన ఆ మార్గమధ్యంలో వెళ్లే వాళ్లకు మరియు రోడ్ క్రాస్ చేసే వాళ్లకు చాలా ఇబ్బంది అవుతుందని జనసేన నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. తరచుగా యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. రీసెంట్ గా ఒక ఫ్యామిలీ బైక్ మీద నుంచి కింద పడ్డారు. గత కొద్ది రోజులుగా ఇలాంటి సంఘటనలు గమనిస్తూనే ఉన్నామని అన్నారు. ఆ దారిలో ప్రయాణించే ప్రజల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని జనసేన పార్టీ తరఫున అమీర్ పూర్ మండలం AE గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జ్ యడమ రాజేష్ , నాయకులు చంద్రకాంత్, శ్రీకాంత్, మహేష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com