రామచంద్రాపురం ( జనస్వరం ) : భారతదేశ హరిత విప్లవ పితామహుడు ఎమ్మెస్ స్వామినాథన్ గారి సంతాప సభ రామచంద్రపురం మండలం వెల్ల గ్రామం లాకుల వద్ద వెల్ల గ్రామ రైతులు మరియు జనసేన నాయకులు మరియు చిక్కాల దొరబాబు గారి ఆధ్వర్యంలో నిర్వహించబడినది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ రంగానికి రైతాంగానికి ఎమ్మెస్ స్వామినాథన్ గారు చేసిన సేవలు గుర్తు చేసుకుని ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. సర్ ఆర్థర్ కాటన్ గారు ఉమ్మడి తూర్పు పశ్చిమగోదావరి జిల్లాలకు రైతులకు ఎటువంటి సేవలు చేశారో ఎమ్మెస్ స్వామినాథన్ గారు భారతదేశం మొత్తానికి అటువంటి సేవలు అందించి వరి గోధుమలు దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి భారత రైతాంగాన్ని తయారు చేయడంలో ఆయన పాత్ర కీలకమని అటువంటి మహనీయులను స్ఫూర్తిదాయకంగా తీసుకుని యువత ముందుకు సాగాలని అటువంటి వారిని స్మరించుకోవలసిన అవసరం ఉందని చిక్కాల దొరబాబు గారు మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ చిక్కాల దొరబాబు గారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శిలైన డేగల సతీష్ గారు బుంగారాజుగారు వెల్ల ఎంపీటీసీ సభ్యులైన చిక్కాల స్వామి, జనసేన పార్టీ వెల్ల అధ్యక్షులైన గుండుబోగుల లక్ష్మణరావు మాజీ సొసైటీ ప్రెసిడెంట్ పాముల వీరభద్ర రావు, గ్రామ రైతులైన పెద్దిరెడ్డి రాంబాబు, ఆకుల సతీష్, ఆకుల గాంధీ, సలాది నాని, కొండేపూడి సాయి, కృష్ణ, కంచర్ల వెంకట్, గొల్ల కోటి బ్రహ్మం, మాధవరపు బుల్లబ్బు, శ్రీమత్తి స్వామి, ఇతర రైతులు మరియు జనసేన నాయకులు కార్యకర్తలు, పాల్గొనడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com