గుడివాడ ( జనస్వరం ) : పవన్ రావాలి పాలన మారాలి అనే ఆకాంక్షతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సమస్యలను తెలుసుకుంటూ సాహస యాత్ర చేస్తున్న జన సైనికున్ని సత్కరించిన గుడివాడ పట్టణ జన సైనికులు. కృష్ణాజిల్లా స్థానిక బస్టాండ్ సెంటర్లో పవన్ రావాలి పాలన మారాలి అనే ఆకాంక్షతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ సమస్యలు తెలుసుకుంటున్న జన సైనికుడు బాలాజీ గారిని జన సైనికులు సన్మానం చేసి అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టిన జనసేన జనవాణి ద్వారా ప్రజల సమస్యలు తీసుకోవడంతో ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని నాగార్జునసాగర్ డ్యాం నుండి రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతూ గ్రామాల్లో పట్టణాల్లో అనేక సమస్యలను తీసుకొని పవన్ కళ్యాణ్ గారికి అందజేయడం జరుగుతుందని ప్రతి కార్యకర్త ఇదేవిధంగా జనసేన పార్టీకి పనిచేస్తే 2024 సంవత్సరంలో మన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసుకోవచ్చని తెలియజేశారు.. వివిధ రాజకీయ పార్టీలు ఓట్లు ఏ విధంగా దండుకోవాలో ఆలోచిస్తూ ఉంటారని కానీ జనసేన పార్టీ ప్రజల్లో ఉండి ప్రజా సమస్యల మీద పోరాడుతూ ప్రజలకు దగ్గరగా ఉంటూన్న ఈలాంటి మహా నాయకుడికి మేమందరం కార్యకర్తలు పని చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నామని తెలియజేశారు... అదేవిధంగా ఇలాంటి సాహస యాత్ర చేస్తున్న బాలాజీ గారికి గుడివాడ పట్టణ జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నూనె అయ్యప్ప, చరణ్ తేజ్, దివిలి సురేష్, గంట అంజి, మరియు జన సైనికులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com