నెల్లూరు జిల్లా సర్వేపల్లి, నియోజకవర్గం, చెముడుగుంట గ్రామపంచాయతీ నందు జనసేన పార్టీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టడం జరిగింది. గ్రామాలలో ఎన్నికలలో గెలిచిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్రామాలలో ఈ కరోనా మహమ్మారి నుంచి కాపాడుకునే దిశగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని కోరుతున్నాం అని అన్నారు. జనసేన పార్టీ తరఫున గెలిస్తేనే పని చేస్తా౦ లేకపోతే పట్టించుకోము అనే విధానం అయితే జనసేనపార్టీది కాదు. ప్రజల బాగోగులే లక్ష్యంగా పని చేసే పార్టీ జనసేన పార్టీ మాత్రమే అని అన్నారు. జనసైనికులు మాట్లాడుతూ పరిస్థితుల్లో బయటకు వచ్చేటప్పుడు డబుల్ మాస్కులు ధరించాలని, ఇటువంటి తరుణంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అనవసరంగా పనిలేకుండా బయట తిరగరాదని, ఎప్పటికప్పుడు చేతులను శుభ్రపరుచుకోవాలని, ఇటువంటి సమయంలో ప్రభుత్వం ప్రకటించిన సమయాల్లోనే బయటకు జాగ్రత్తలు తీసుకొని వెళ్ళిరావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికలు శ్రీనివాసులు, సతీష్, అవినాష్, వంశీ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
హిందూపురం నియోజకవర్గం, కొండూరు గ్రామంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన జనసైనికులు
అంబులెన్స్ దోపిడిని అరికట్టండి : నెల్లూరు జనసేన నాయకులు షానవాజ్
బ్లాక్ ఫంగస్ వచ్చిన జనసైనికుడికి ఆర్థిక సహాయం అందించిన బొలియశెట్టి శ్రీకాంత్
ఆరోగ్య సిబ్బంది, పారిశుధ్య సిబ్బందికి కరోనా కిట్లు అందించి మాకినీడి యువసేన – జనసేన
సోషల్ మీడియాలో ” జనస్వరం న్యూస్ “ ను ఫాలో అవ్వండి :
Facebook Twitter Youtube Instagram Telegram DailyHunt APP Download Here