Logo
Date of Publish : 01 May 2021, 5:40 am
Editor : Sake Naresh

కేశవదాసుపాలెం గ్రామంలో గ్యాస్ పైపు లీకేజీని గుర్తించి అధికారులకు తెలియజేసిన జనసైనికులు

           తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంసఖినేటిపల్లి మండల పరిధిలోని కేశవదాసుపాలెం గ్రామంలో బెల్లంకొండ వారి గ్రూపు సమీపంలో నివాస గృహాల మద్య ఓఎన్జీసీ గ్యాస్ పైపు లైను లీకేజీ అయ్యింది. ఈ విషయాన్ని గమనించిన స్థానిక జనసైనికులు అధికారులకు సమాచారం అందించారు. అధికారులు వెంటనే స్పందించి సఖినేటి పల్లి ఎస్ఐ గోపాలకృష్ణగారు పైప్ లైన్లు లీక్ అవుతున్న స్థలాన్ని పరిశీలించడం జరిగింది. అనంతరం ఓ‌ఎన్‌జి‌సి అధికారులతో మాట్లాడి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం తీసుకురావాలంటూ ఎస్‌ఐ గారు ఓ‌ఎన్‌జి‌సి అధికారులను కోరడం జరిగింది. ఇందులో సఖినేటిపల్లి ఎస్ఐ గోపాలకృష్ణగారు కేశవదాసుపాలెం వి ఆర్ ఓ నాగరాజు గారు, ఎన్నారై మండేల బాబి నాయుడు గారు స్థానిక జనసైనికులు ఆచంట పండు గారు, బెల్లంకొండ రామారావు గారు, ఓ ఎన్ జి సి అధికారులు సత్యనారాయణ గారు స్థలాన్ని పరిశీలించడం జరిగింది. సకాలంలో సమస్యను అధికారుల దృష్టికి తీసుకువచ్చినందుకు జనసైనికులను అభినందించారు. త్వరలోనే శాశ్వత పరిష్కారం కల్పిస్తామని హామీ ఇచ్చారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com