
హనుమకొండ, (జనస్వరం) : ఉమ్మడి వరంగల్ జిల్లాలో భాగమైన జనగామ నియోజకవర్గంలో గత రెండు రోజులుగా అధికార ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు, నాయకులు వ్యవహరించిన తీరు తీవ్రంగా కలిచి వేసింది అని జనసేన పార్టీ గ్రేటర్ వరంగల్ అధ్యక్షులు బైరి వంశీ కృష్ణ అన్నారు. ఒకవైపు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు యువతకి మంచి రాజకీయ భవిష్యత్ ఇవ్వాలని జనసేన పార్టీని స్థాపించి మంచి మార్గంలో నడిపిస్తుంటే మిగతా పార్టీ నాయకులు యువతకి రాడ్లు, కర్రలు ఇచ్చి రోడ్డు మీదకు ఎక్కి తలలు పగలుకొట్టుకునే రాజకీయం నేర్పిస్తున్నారు. నీతిమాలిన రాజకీయాలు చేస్తూ కేవలం నాయకుల రాజకీయ లబ్దికోసం యువత జీవితాలను నాశనం చేస్తున్నారు. యువతని రాజకీయ లబ్దికోసం వాడుకుంటూ కేవలం ఓటు బ్యాంకుగా చూస్తున్న ఈ నాయకులకు రాబోయే రోజుల్లో తగిన బుద్ది చెప్తారని అన్నారు.