తెలంగాణ, (జనస్వరం) : జనసేన విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు సంపత్ నాయక్ ఆదేశాలతో రామంతపూర్ నారాయణ జూనియర్ కళాశాల చైర్మన్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా పెట్టె ఇబ్బందులకు తట్టుకోలేక ప్రిన్సిపాల్ రూమ్ లో విద్యార్థి సాయి ఒంటికి నిప్పు పెట్టుకొని ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. ఆ విద్యార్థికి న్యాయం చేయాలని నారాయణ విద్యా సంస్థల చైర్మన్ ను జనసేనపార్టీ విద్యార్థి విభాగం డిమాండ్ చేయడం జరిగింది. అలాగే జనసేన విద్యార్థి విభాగం నాయకులు గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ మహేష్ పెంటల, జనరల్ సెక్రటరీ లు తోరం సూర్య, దార ప్రణీత, కమిటీ మెంబెర్స్ రాజేష్, మనీష్, శ్రీనివాస్ చెనిగెల, పృథ్విరాజ్ లను నిరసనలు తెలియజేయడంతో పోలీసులు అరెస్టు చేసి మలక్ పేట్ పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com