అరకు ( జనస్వరం ) : జనసేనపార్టీ కార్యాలయంలో ఆదివాసీ మాతృభాష ఉపాధ్యాయులు వారి సమస్యలపై జనసేనపార్టీ అరకు పార్లమెంట్ ఇన్చార్జ్ డా..వంపూరు గంగులయ్యని కలిసి వినతి పత్రం సవమర్పించడమైనది. ఈ సందర్బంగా మాతృభాషను ఉపాధ్యాయుల నాయకులు మాట్లాడుతూ మాతృభాష విద్యాబోధన విలువల ఆధారిత ప్రతిభ పూర్తిగా వైసీపీ ప్రభుత్వం విస్మరించిందని ఈ రోజు మాకు మా నియామకాలకు సంబంధించి, మా వేతనాలుకి సంబంధించి గాని ఏ నిర్ణయం సముచితంగా తీసుకున్నట్టు కనిపించడం లేదని, అసెంబ్లీలో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి స్వయంగా ప్రస్తావించినప్పటికి తూతూ మంత్రాంగానే వ్యవహారం సాగిందని ఇలా అయితే మాతృభాష విద్య బోధన ఉపాధ్యాయులు నష్టపోతారని ఎన్నో సార్లు మొత్తుకున్నప్పటికి ఫలితం లేదని వాపోయారు. పైగా స్వయంగా ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి మమ్మల్ని పిలిపించి మీ వల్ల మాకు సీఎం గారు చివాట్లు పెడుతున్నారని మమ్మల్ని అనడం ఎంతవరకు సమంజసమన్నారు. ఈ విషయంపై స్పందించిన జనసేనపార్టీ ఇన్చార్జ్ డా..గంగులయ్య మాతృభాష విద్య ఉపాధ్యాయులకు మొదటి నుంచి అండగా ఉన్నాం ఇకపై కూడా ఉంటాం. ఎందుకంటే ఏ జాతికైనా తమ మూలాలు, తమ ఆచార వ్యవహారాలు,సాంస్కృతిక కార్యక్రమాలు, అభివృద్ధి కేవలం మాతృభాషతోనే ముడిపడి ఉంటుంది ఆస్తిత్వంలో ప్రధాన పాత్ర భాష తోనే మొదలవుతుంది అటువంటి భాష లోనే తమ జాతి అభివృధ్ధికోసం అహర్నిశలు శ్రమించే మాతృభాష ఉపాధ్యాయుల సమస్యలు, వారియొక్క డిమాండ్లు ఇప్పుడున్న ప్రజాప్రతినిధులలా కాకుండా కచ్చితంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తామని, వివిధ రకాల ప్రజల భాషల్ని ఒకే ప్రాతిపదికన చూసి గౌరవించే గొప్పలక్షణం గలా పార్టీ కేవలం జనసేనపార్టీ మాత్రమేనని అంతే కాదు జనసేనపార్టీ సిద్ధాంతాలలో భాషాల్ని గౌరవించే సంస్కృతి నాలుగో అంశంగా ఉందని అన్నారు. ఈ విషయం కేవలం గిరిజన మాతృభాష ఉపాధ్యాయులే కాకుండా గిరిజన ప్రజానీకం కూడా గుర్తించుకోవలని తెలిపారు. ఈ సమావేశంలో పాడేరు మండల పట్టణ అధ్యక్షులు మజ్జి నగేష్, పాడేరు మండల అధ్యక్షులు నందోలి మురళి కృష్ణ, చింతపల్లి నాయకులు ఉల్లి సీతారామ్, దేపురు రాజు, కృష్ణమూర్తి, వంతల రాజారావు, అబ్బాయి దొర, వనబరంగి సాయి, మహేష్, అనిల్ కుమార్ సాలేబు అశోక్, తదితర జనసైనికులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com