గంగాధర్ నెల్లూరు ( జనస్వరం ) : వెదురుకుప్పం మండలం, పచ్చికాపల్లం లో వెదురుకుప్పo, కార్వేటినగరం మండలాలను తిరుపతి జిల్లాలో కలపాలని జనసేన, బిజెపి, అఖిలపక్షం నాయకుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన ఇన్చార్జి యుగంధర్ మాట్లాడుతూ విలీనాన్ని రెండు మండలాల ప్రజలు కోరుకుంటున్నారనీ, నీ అభ్యంతరం ఏమిటి స్వామి అని ఉపముఖ్యమంత్రి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమధ్య వెదురు కుప్పం మండలంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశపు ప్రతిపాదన ఏమైంది? అది అక్కడి వరకేనా? లేదా ప్రతిపాదనలు పంపారా? లేక ఉత్తుత్తి ప్రతిపాదనా? అని ఎద్దేవా చేశారు. ప్రజలకు అవసరమైంది, ప్రజా ప్రతినిధులకు ఎందుకు అవసరం లేదు? అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జనాలను పట్టించుకోని జల్సా స్వామి, ఇప్పటికైనా రెండు మండలాల ప్రజలకు న్యాయం చేయాలని, ఈ విషయంలో రెండు మండలాల ప్రజాప్రతినిధులు అనగా సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పిటిసిలు ముక్తకంఠంతో ఉపముఖ్యమంత్రి పై ఒత్తిడి తీసుకురావాలని ఈ సందర్భంగా కోరారు.
ఈసారి ఎన్నికల్లో టికెట్ కోల్పోయే రోజా రెండు మండలాలను తిరుపతిలో కలిపినప్పుడు, నీకంటే తక్కువ పదవిలో ఉన్న పెద్దిరెడ్డి రెండు మండలాలకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తుండగా, నువ్వెందుకు మౌనవహిస్తున్నావని విమర్శించారు. అది నీ చేతగాని తనమా లేక అసమర్థత, లేకపోతే స్వలాభమా, లేదంటే స్వార్ధమా అని తీవ్రస్థాయిలో విమర్శించారు. జెరూసలేములో జల్సా నీకోసం అయితే, రెండు మండలాల ప్రజలు జల్సా చేసుకొనేటట్టు వెదురుకుప్పం, కార్వేటి నగరo మండలాలను తిరుపతి జిల్లాలో కలపాలని డిమాండ్ చేశారు. జనసేన పార్టీ నియోజకవర్గ బూత్ కన్వీనర్ యతీశ్వర్ రెడ్డి గుండు గీయించుకొని నిరసన తెలియజేశారు. పచ్చికాపల్లంలో ఉన్న వివిధ షాపు యజమానులు స్వచ్ఛందంగా షాపులను మూసేసి ధర్నాలో పాల్గొన్నారు. రెండు మండలాల ప్రజలకు న్యాయం జరిగినప్పుడు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని, వచ్చే బుధవారము వెదురు కుప్పం మండల కేంద్రంలో వంట వార్పు కార్యక్రమంతో నిరసన తెలియజేసి, చివరికి తిరుపతిలో కలిసేంతవరకు పోరాటం ఆగదని సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గం బూత్ కన్వీనర్ యతీశ్వర్ రెడ్డి, మండల యువజన అధ్యక్షులు సతీష్, బిజెపి స్టేట్ కౌన్సిల్ సభ్యులు హనుమంత రెడ్డి, మండల బిజెపి అధ్యక్షులు తిరుమల చారి, జిల్లా జనసేన సంయుక్త కార్యదర్శి రాఘవ, కార్వేటి నగరo మండల అధ్యక్షులు శోభన్ బాబు, ఉపాధ్యక్షులు విజయ్, ప్రధాన కార్యదర్శి నరేష్, జీడి నెల్లూరు మండల బూత్ కన్వీనర్ తులసి రామ్, మండల ఉపాధ్యక్షులు రషీద్, బిజెపి బూత్ కమిటీ ఇంచార్జి ప్రభాకర్ రాజు, జిల్లా కార్యదర్సులు లక్ష్మి, హరినాధ్ రెడ్డి, జిల్లా కిసాన్ మోర్చా ఉపధ్యక్షులు విశ్వనాధ రెడ్డి, మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు గోవిందు రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి విజయ భాస్కర్ రెడ్డి, బిజెపి నాయకులు జ్యోతిశ్వర్, హేమ శేఖర్ రెడ్డి, యుగంధర్ రెడ్డి, సతీష్, జనసైనికులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com