పాలేరు ( జనస్వరం ) : గూడెం జనసేనపార్టీ నాయకులు గ్రామస్థాయి పర్యటనలో భాగంగా పలు గ్రామాలకు సందర్శిస్తూ, ప్రజా సమస్యలు తెలుసుకుంటూనే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివాసి ప్రాంతంలో జరుగుతున్న అనేక అసాంఘిక కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండాలని మైదాన ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళు చూపే తాత్కాలిక నేరపూరిత పనులపై యువతకు మార్గనిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా నిరుద్యోగ యువత పెడదోవన పట్టడానికి ప్రధాన కారణాలను పరిశీలించి చూస్తే ముమ్మాటికీ చదువుకున్న చదువుకు తగిన ఉపాధి కల్పించకపోవడమేనని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. అలాగే అదివాసి హక్కులు, చట్టాలు నిర్వీర్యమై పోతున్నప్పుడు ఎంత బలహీనమైన సమూహమైన కూడా తిరగబడుతుందని, రానున్న రోజుల్లో ఈ పరిస్థితులు ఇంకా దిగజరిపోకుండా ప్రజలే నిస్వార్థ నాయకులని ఎన్నుకోవాలని, సంపద కోసం రాజకీయాల్లోకి వచ్చే నాయకులను ఎన్నుకుంటున్నంత కాలం గిరిజనులకి రక్షణ ఉండదని అన్నారు. దయచేసి జాతి ఐక్యత, జాతి రక్షణ చేయగల నాయకులను ఎన్నుకోవలన్నారు.
గిరిజన యువత భవిష్యత్తు ప్రస్తుతం గిరిజన ప్రజల చేతుల్లో ఉందని ప్రభుత్వం అప్పులు చేసి తెచ్చి ఇచ్చే ఉచితాలకు లోబడి మీ పిల్లలను దొంగలుగా, దారి దోపిడీ దార్లుగా, రౌడీలుగా, వ్యసనపరులను చేయవద్దని ఈ సందర్బంగా నియోజకవర్గ ప్రజలకు విన్నవించుకుంటున్నమన్నారు. ఆదివాసీ ప్రజలు ఒక విషయం గుర్తుపెట్టుకోవలని ఏ మాత్రం వైకాపా ప్రభుత్వం మళ్ళీ ఇంకోసారి అధికారం సాధించుకుంటే ఈ ప్రాంతంలో వనరులు కొల్లగొట్టి తమ అక్రమ దందా చెయ్యడానికి సన్నాహాలు ఎప్పుడో మొదలెట్టేసిందని ఇప్పుడు గనక సరైన నాయకుడిని ఎన్నుకొకపోతే మనం తలా దాచుకోవడానికి పారిపోవడానికి వేరే ప్రాంతం లేదని అన్నారు. ఈ ప్రపంచంలో దశాబ్దాలుగా పరిశీలించి చూస్తే అధివాసిలు తమ ప్రాంతాలు కోల్పోవడానికి ప్రభుత్వాల ముసుగులో చేసే మాఫియా ఆగడాలను ముందస్తుగా గుర్తించి మేల్కోకపోవడమేనని అన్నారు. జాతి ఆస్తిత్వంపై అత్యాచారం చేసిన మన వైసీపీ ప్రజాప్రతినిధులు ఇంకోసారి మిమ్మల్ని దోచుకుంటాం మీ జాతిని నాశనం చేస్తామని అన్నారు. దయచేసి ఇంకో అవకాశం ఇవ్వండని ఇప్పుడు ఊర్ల వెంబడి తిరుగుతున్నారని, 4నాలుగేళ్ళ కాలంలో ప్రజా సమస్యలు పక్కన బెట్టి ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో డ్రామాలు,నాటకాలు విపరీతం చేస్తూ హడావిడి చేస్తున్నారన్నారు. గిరిజన చట్టాలు,హక్కులు కాపాడుకోవలన్న, రక్షించుకోవలనుకున్నా పలు సంస్కరణలు చేసి ఆదివాసీ సమాజానికి మెరుగైన భవిష్యత్ ఇవ్వాలన్న అది కేవలం జనసేనపార్టీ తోనే సాధ్యమని, అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఎస్టీలపై శిత్తశుద్ధి ఉందని ఈసారి ఒక అవకాశం జనసేనాని ఇద్దామన్నారు. ఈ క్షేత్రస్థాయి పర్యటనలో జనసేనపార్టీ లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్, గూడెం మండల అధ్యక్షులు కొయ్యం బాలరాజు, అరడా కోటేశ్వరరావు, విష్ణు పోతుకురి, చింతపల్లి మండల అధ్యక్షులు వంతల బుజ్జిబాబు, బూత్ కన్వీనర్ ఉల్లి సీతారామ్, చెట్టి స్వామి, తదితర జనసైనికులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com