విజయనగరం ( జనస్వరం ) : వైఎస్సార్సీపీ మాజీ మంత్రి పేర్ని నాని పవన కళ్యాణ్ పై చెప్పులు చూపించి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా శనివారం ఉదయం జనసేన పార్టీ నాయకులు గురాన అయ్యలు నేతృత్వంలో పేర్ని నాని ఫోటోకు చెప్పులు దండవేసి, పేర్ని నాని మాటలు వెనక్కి తీసుకోవాలని,నానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ స్థానిక ఆర్.టి.సి. కాంప్లెక్స్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గురాన అయ్యలు మాట్లాడుతూ మాజీ మంత్రి పేర్ని నాని నోరు అదుపులో పెట్టుకోవాలని,లేని పక్షంలో చెప్పుల వర్షంతో నాని ని ముంచుతమాని గట్టిగా హెచ్చరించారు. ముందుగా పవన్ కళ్యాణ్ ఏ సందర్భంలో వైసీపీ నాయకులకు చెప్పు చూపించారో తెలుసుకోవాలని, పవన్ ను రెచ్చగొట్టేందుకు దత్తపుతృడని,ప్యాకేజీ స్టార్ అని ఊరకుక్కల్లా వైసీపి నాయుకులంతా తప్పుడు వ్యాఖ్యలు చేయడం వలనే పవన్ కళ్యాణ్ ఆరోజు అధారం లేకుండా తప్పుడు కూతలు కూస్తే చెప్పుతో కొడతామని అన్నారు. పవన్ కళ్యాణ్ తన సొంత నిధులతో కౌలు రైతులకు కోట్లాది రూపాయలు సహాయం చేస్తున్నారని, ఎప్పుడూ దమ్ముకోసం మాట్లాడే ఈ దమ్మున్న వైసీపీ నాయకులు పవన్ సహయంలో కొంతైనా చేసి దమ్మున్న నాయకులమని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు ఆదాడ మోహనరావు, జనసేన ఝాన్సీ వీర మహిళ మాతా గాయిత్రి,నాయకులు వంక నరసింగరావు,దంతులూరి రామచంద్ర రాజు, త్యాడ రామకృష్ణారావు(బాలు), ఎల్.రవితేజ, ఎంటి రాజేష్, పిడుగు సతీష్, పి.రవీంద్ర, తోటపాలెం వాసు, ఎం. పవన్ కుమార్, వి.ననీన్ కుమార్, సాయి, భార్గవ్, అభిలాష్ , అప్పలనాయుడు, సురేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.