Logo
Date of Publish : 12 December 2022, 4:01 pm
Editor : Sake Naresh

అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించిన చోటనే తిరిగి పునరుద్ధరించాలని జెఏసి నాయకులకు సంఘీభావం తెలిపిన జనసేన

      రాయచోటి ( జనస్వరం ) : అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలోతహశీల్దార్ కార్యాలయం ఆవరణంలో 5 వ రోజు చేపట్టిన రిలే నిరాహారదీక్షకు సంఘీభావంగా శిబిరాన్ని ఉద్దేశించి జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్ మాట్లాడుతూ... అంబేద్కర్ గారికి అవుమానం జరిగితే జనసేన చూస్తూ ఊరుకోదని అన్నారు. పేదలకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ జనసేన అండగా ఉంటుందని బాబసాహెబ్ అంబెడ్కర్ గారి విగ్రహం అంటే రాష్ట్ర వైసీపీ ప్రభుత్వానికి, పాలకులకు, అధికార యంత్రాంగానికి ఎందుకంత భయమని నిలదీశారు. వారిలో చిత్తశుద్ధి ఉంటే విగ్రహన్ని తొలగించిన చోటనే తిరిగి ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పాలకులు తక్షణమే స్పందించి త్వరతిగతిన పునరుద్ధరించాలని అదేవిధంగా ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత అవినటువంటి బాబసాహెబ్ అంబెడ్కర్ గారి విగ్రహాన్ని వెంటనే తొలగించిన స్తానంలోనే నిలబెట్టాలని డిమాండ్ చేశారు. రాయచోటి అసంబ్లీ ఇంఛార్జ్ షేక్ హసన్ భాష మాట్లాడుతూ మన దేశానికి రాజ్యాంగ సృష్టికర్త విగ్రహానికే భద్రత లేదంటే ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేమన్నారు. కాబట్టి అందరూ కలిసి చైతన్యం అవ్వి ఇటువంటి దుర్మార్గాలకు, దుశ్చర్యలకు పాల్పడుతున్న వారిని ఖండించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నాయకులు పఠాన్, జయరామ్, కొండా, వశివుల్లా, ప్రదీప్, జనసైనికులు మరియు జెఏసి నాయకులు, ప్రజాసంఘాలు, అంబేద్కర్ సేన, పలురాజకీయ పార్టీలు, వివిధ మాధ్యమాల నేతలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com