అంతర్జాతీయ స్థాయిలో విశిష్ట గుర్తింపు పొందిన CEO డా. జేవీఎస్ భాస్కర్ విజయ ప్రస్థానం.
కాకినాడ,మే 27( జనస్వరం)
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, TEDx స్పీకర్, ట్రైనర్ మరియు Inspire Ray of Life వ్యవస్థాపకులు & CEO డా. జేవీఎస్ భాస్కర్ విజయగాథ అంతర్జాతీయ స్థాయిలో మరోసారి ప్రశంసలు అందుకుంది.ఆయన ప్రస్థానం Global Icons of India E-Magazine లో ప్రచురితమవడం గర్వకారణంగా నిలిచింది.సాధారణ స్థాయి నుంచి ప్రారంభమైన ఆయన ప్రయాణం,నేడు ప్రపంచ వేదికలపై స్ఫూర్తిదాయక నాయకత్వానికి ప్రతీకగా నిలిచింది.యువతలో ఆత్మవిశ్వాసం,లక్ష్యసాధన, నాయకత్వ నైపుణ్యాలు,వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలపై ఆయన అందిస్తున్న మార్గదర్శకత్వం అనేక మందికి కొత్త దిశను చూపింది.దేశీయ మరియు అంతర్జాతీయ వేదికలపై నిర్వహించిన ప్రేరణాత్మక ప్రసంగాలు, సామాజిక మార్పు కోసం చేపట్టిన కార్యక్రమాలు, వ్యక్తిగత వికాసానికి అందించిన సహకారం ఆయనకు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చాయి.ప్రపంచంలోని అనేక ప్రాంతాల ప్రజలతో కలిసి పనిచేస్తూ, సానుకూల ఆలోచనలను వ్యాప్తి చేయడం ద్వారా యువతలో నూతన ఆశయాలను నింపుతున్నారు.నాయకత్వం, సేవాభావం,క్రమశిక్షణ మరియు అంకితభావం ద్వారా సమాజ అభివృద్ధికి తన వంతు కృషిని కొనసాగిస్తున్నారు.ఈ గుర్తింపు ఆయన సాధించిన విజయాలకు మాత్రమే కాకుండా భవిష్యత్తులో మరింత మంది జీవితాలలో మార్పు తీసుకురావాలనే సంకల్పానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఆయన ప్రయాణం నేటి తరానికి స్ఫూర్తిదాయక ఉదాహరణగా నిలుస్తోంది.