Search
Close this search box.
Search
Close this search box.

ప్రస్తుత పరిస్థితులపై ఓ జనసైనికుడి అంతరంగ నివేదన…

ప్రస్తుత పరిస్థితులపై ఓ జనసైనికుడి అంతరంగ నివేదన… 

                 తెలంగాణ రాష్ట్రంలో.. గత ఆరు సంవత్సరాలు టిఆర్ఎస్ కుటుంబ పాలన తీవ్రమైన నిరాశ నిస్పృహలకు గురి చేసింది.  తెలంగాణ ఒక సుసంపన్నమైన రాష్ట్రం. ప్రస్తుతం అప్పుల రాష్ట్రంగా అభివృద్ధి చెందుతుంది. టిఆర్ఎస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన అనేక హామీలను విస్మరించడం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇదిలా ఉంటే, కోవిడ్ క్లిష్ట పరిస్థితులలో ప్రభుత్వ అసమర్థత, ఈ మధ్య వచ్చిన వరదలు హైదరాబాద్ దుస్థితిని ప్రపంచానికి పరిచయం చేసిందని చెప్పుకోవచ్చు. ఇలాంటి అస్తవ్యస్థ పరిస్థితి నెలకొన్న తెలంగాణలో దుబ్బాక ఓటమి కెసిఆర్ కు చెంపపెట్టు అయ్యి తీవ్ర ఆందోళనలో పడేసింది. ఇంతలోనే జిహెచ్ఎంసి ఎన్నికల ప్రకటన రావడం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం అన్నింటా వైఫల్యం, ప్రజలలో నెలకొని ఉన్న తీవ్ర వ్యతిరేకత, దుబ్బాక విజయం టిఆర్ఎస్ ప్రత్యర్ధుల్లో ఉత్సాహం నింపింది. ముఖ్యంగా బిజెపిలో మరింత ఉత్సాహాన్ని కలిగించింది. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో కెసిఆర్ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేప్రసంగాలు కూడా ఆ పార్టీకి మరింత ఆప్రతిష్ఠ తెచ్చే పెట్టే పరిస్థితులు నెలకొన్నాయి.

                 జనసేన పార్టీ విషయానికి వస్తే, కోవిడ్ కష్టకాలంలో మరియు ఈ మధ్య కాలంలో వచ్చిన వరదల సందర్భంగా విశిష్ట సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందడం హైదరాబాద్ ప్రజలను విశేషంగా ఆకర్షించింది. ఇలాంటి అనుకూల పరిస్థితుల మధ్య జనసేన పార్టీ జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేయాలని భావించడం టీఆర్ఎస్ పార్టీకి ఆందోళన కలిగించింది. అందుకు తగిన విధంగానే, జనసేన పార్టీ శ్రేణులు ఉత్సాహంతో పార్టీ ప్రతిష్టను ఇనుమడింప చేసే విధంగా తీవ్ర వ్యయ ప్రయాసతో కూడిన అనేక సేవా కార్యక్రమాలు, ప్రచార కార్యక్రమాలతో హైదరాబాద్ ప్రజలకు మరింత చేరువయ్యారు, ఆకర్షించారు. అందుకు తగిన విధంగా అనేక ప్రాంతాలలో అభ్యర్థులు నామినేషన్ వేయడం జరిగింది.
                  మొదటినుండి బీజేపీ శ్రేణులు జనసేనతో పొత్తు ఉండదు ప్రకటన చేస్తూనే ఉన్నారు. తదుపరి పొత్తుకోసం చర్చలు జరుగుతున్నాయి అంటూ చివరి క్షణం వరకు  సస్పెన్స్ తో మురిపించారు. బిజెపి అధినేతలు ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారిని కన్విన్స్ చేశారో తెలియదు గానీ, జనసేన పార్టీ అధినేత జిహెచ్ఎంసి ఎన్నికల బరి నుండి తప్పుకుంటున్నట్లు  జనసైనికుల ఉత్సాహం పాలిట పిడుగు లాంటి ఆకస్మిక ప్రకటన చేశారు. అంతేగాక తమ సంపూర్ణ మద్దతు బీజేపీకి ఇవ్వాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు. ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి, ప్రతిష్టాకరమైన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని ఉత్సాహంతో పని చేస్తున్న జన సైనికులను షాక్ గురి చేసింది. అందివచ్చిన అనుకూల పరిస్థితులను నాయకుడే కాలరాయడం వారిని తీవ్రంగా కలతకు గురి చేసింది అన్నది కాదనలేని నిష్టురమే.

                       పర్యవసానం… బిజెపి పవన్ కళ్యాణ్ గారిని కన్విన్స్ చేసి జనసేన పార్టీ బరిలో లేకుండా చేయడం వలన విశిష్టమైన మద్దతును బిజెపి కోల్పోవడం.. నాయకుడు ఓటు చీలి పోతుంది అని చెబుతున్నారు. నిజమే. ఉమ్మడిగా పోటీ చేస్తే వచ్చే అద్భుత ఫలితాల ప్రస్తావనను  ఎందుకు మరుగన పెడుతున్నారో అర్థం కాక జనసైనికులను విస్మయానికి గురిచేస్తుంది. విశిష్ట సేవలు అందిస్తూ, ఎన్నికల బరిలో ద్విగుణీకృత ఉత్సాహంతో నిలవాలనీ భావించిన అభ్యర్థుల, జనసైనికుల మనోభావాలను కూడా కనీసం పరిగణనలోకి తీసుకోకుండా ఎన్నికల బరి నుండి తప్పుకోవాలని భావించడం వెనుక జనసేన పార్టీ పొందిన లబ్ధి ఏమిటో సేనానికే తెలియాలి. నిరుత్సాహానికి గురైన పార్టీ శ్రేణులకు అయినా వివరిస్తారో లేదో అన్నది వారి విజ్ఞత. జనసేన పార్టీకి జరగబోతున్న కష్టం.. నష్టం…  అత్యంత అనుకూలమైన పరిస్థితులు ఉండి, జనసేన పార్టీ ప్రతిష్ట, నాయకత్వం, ఆలోచన విధానములో ప్రజలలో సందేహాలు వెల్లువెత్తడం, జిహెచ్ఎంసి ఎన్నికల ద్వారా తెలంగాణలో జనసేన పార్టీ బలం పుంజుకునే అవకాశం కోల్పోవడం. మిత్రపక్షంగా భావిస్తున్న బిజెపి గెలుపు మరింత ఒత్తిడికి గురికావడం. కేసీఆర్ విజయం సాధిస్తే, అది జనసైనికుల పాలిట మరింత శాపంగా మారే ప్రమాదం. జిహెచ్ఎంసి ఎన్నికలలో సామాన్య ఫలితాలు పొందిన, దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్ తీవ్ర అనుకూలమైన పరిస్థితులకు స్ఫూర్తిగా నిలిచేది అన్న సత్యం విస్మరించడం.

                       బీజేపీ జనసేన ఉమ్మడి గా పోటీ చేస్తే, బీజేపీ ఘన విజయంలో జనసేన పార్టీ ప్రభావం ప్రస్ఫుటం అయ్యేది అనేది కాదనలేని సత్యం. జీహెచ్ఎంసీ ఎన్నికలో సాధారణ విజయాలు కూడా తెలంగాణ జనసేన పార్టీ శ్రేణులకు బలమైన పునాదిగా నిలిచేది. ఓడినా ..గెలిచినా తెలంగాణలో జనసేన పరిధి ఖచ్చితంగా విస్తరించేది. అది జనసైనికులు నాయకులుగా ఎదిగేందుకు తోడ్పడేది. జిహెచ్ఎంసి ఎన్నికల్లో కేసీఆర్ విజయం సాధిస్తే, అధికారం అండతో నయానో భయానో జనసైనికులను ప్రలోభాలకు గురిచేసి జనసేన పార్టీని నిర్వీర్యం చేసే అవకాశాలు పుష్కలం. అందులో కేసీఆర్ సిద్ధహస్తుడు. తీవ్ర ఆవేదనకు గురి అయిన జనసేన పార్టీ శ్రేణులు బిజెపి విజయ అవకాశాలు నిర్వీర్యం చేసే ప్రమాదం. జనసేన పార్టీ బరిలో ఉంటే, విశిష్ట స్థానం కలిగిన ముస్లిం ఓటును ఎంతో కొంతమేర ప్రభావితం చేసి ఉండేవారు. ఇన్ని రకాల అనుకూలతలు మధ్య పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం సమంజసమే అన్న భావన GHMC ఎన్నికల ఫలితాలు మాత్రమే సమాధానం చెబుతాయి.

            చివరిగా…. జిహెచ్ఎంసి ఎన్నికల్లో బిజెపి విజయం పవన్ కళ్యాణ్ గారి నిర్ణయంతో ముడిపడి ఉంది. వారి నిర్ణయం “సకాలంలో చేసిన సరి అయిన వైద్యమే” అన్న వాదన నిజం కావాలి అంటే..

                     జనసైనికులు, నాయకులు, శ్రేయోభిలాషులు …యావత్తు పవన్ కళ్యాణ్ గారిని నమ్మి, జనసేన పార్టీ పట్ల తీవ్ర విశ్వాసాన్ని కనపరుస్తు, బిజెపి విజయానికి త్రికరణ శుద్ధితో, సంపూర్ణ సహాయ, సహకారాలు అందించడమేకాక, సర్వశక్తులూ ఒడ్డి పోరాడటమే తెలంగాణ జనసైనికుల ముందున్న తక్షణ కర్తవ్యం. (2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చిన విధంగా) పవన్ కళ్యాణ్ గారు కూడా పూర్తి బాధ్యత వహించి వ్యక్తిగతంగా ప్రచారంలో  పాల్గొంటూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ బిజెపి ఘన విజయానికి తోడ్పడాలి. ( పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం వెనుక ఉన్నా బిజెపి పాచిక పారినట్టు) తెలంగాణలో జనసేన పార్టీ కీర్తిప్రతిష్టలు  మరింత పరిధి విస్తరించి కోవాలని, ఆ ప్రయత్నాలలో ప్రతి జన సైనికుడు అహరహం శ్రమించాలని ఆశిస్తాను. జనసేనాని ఏ నిర్ణయం తీసుకున్నా మాకు శిరోధార్యమే. కానీ ఆ నిర్ణయం జనసైనికులను దృష్టిలో పెట్టుకొని తీసుకోవాలి. ఇక్కడ జనసైనికుడుని ఎందుకు దృష్టిలో పెట్టుకోవాలి అంటే…. పార్టీకి జెండా కడుతాడు, జెండా మోస్తాడు, నాయకులను ఊరేగిస్తాడు, పార్టీకి ర్యాలీలు చేస్తాడు, తన స్వంత డబ్బులు పెట్టి జనసేవ కార్యక్రమాలు చేస్తాడు, సమావేశాలు పెడితే ఖర్చులు భరిస్తాడు, బైకు ర్యాలీలు చేస్తాడు, ఇంటింటా తిరిగి ప్రచారం చేస్తాడు, ప్రత్యర్థులతో దెబ్బలు తింటాడు, ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలు కోల్పోతాడు… అసలు ఒక మాటలో చెప్పాలంటే ప్రాణాలే పణంగా పెడతాడు. ఇవన్నీ ఏ నాయకుడు చేయడు.. కొద్దిగా డబ్బులు వెదజళ్ళితే పక్క పార్టీలోకి వెళ్లిపోయే వాళ్ళే తప్ప పార్టీకి ఏనాడూ బలం కాలేరు. కావున నాయకులని దృష్టిలో పెట్టుకొని కాకుండా, కార్యకర్తలను దృష్టిలో పెట్టుకొని జనసేనాని నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నాను. 

                 రానున్న అతి కొద్ది రోజుల్లో ఆంధ్రాలోని తిరుపతి పార్లమెంటరీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఆలస్యం  చేయకుండా జనసేన బీజేపీ ఒక నిర్ణయానికి వచ్చి అభ్యర్థిని ప్రకటిస్తే బాగుంటుంది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు వారి అభ్యర్థులను ప్రకటించారు. జనసైనికులు కూడా మన రాజు సింహాసనం మీద కూర్చోవాలి అనుకోవాలి గాని, ప్రతిసారి నిస్వార్థంగా ఆలోచిస్తూ ఆ పీఠాన్ని మరొకరికి అందిస్తానంటే సగటు జనసైనికుడు లోలోపల బాధపడుతూనే ఉంటాడు. ఇక్కడ ప్రతి ఒక్కరూ జనసేనాని మాటే శిరోధార్యం అంటుంటారు. నేను విశ్వసిస్తాను. కానీ, వచ్చిన ప్రతి అవకాశాన్ని ఇలా చేజారిస్తే మనం రాజకీయాలు ఎందుకు చేసుకోవాలి అన్న సందేహం ఖచ్చితంగా క్షేత్ర స్థాయిలో జెండా పట్టే వాడికి తెలుసు. జనసేన పార్టీ ఇప్పటికీ క్షేత్ర స్థాయిలో కమీటీలు వేయడం ఆలస్యం అయింది. ఒక సామాన్య జనసైనికుడికి క్షేత్ర స్థాయిలో ప్రత్యర్థుల నుంచి బెదరింపులు, ఒత్తిళ్ళు, దాడులకు దిగుతుంటే ఎవరికి చెప్పుకోవాలి ? ప్రతి ఒక్కరినీ పవన్ కళ్యాణ్ గారే ఓదార్చలేరు కదా ? కావున క్షేత్ర స్థాయిలో కమీటీలు వేయండి. తద్వారా జనసేన సిద్దంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళండి. పార్టీని బలోపేతం చేయండి. 

         మనం సైనికులం, రాజు ని సింహాసనం మీద కూర్చోపెట్టడం మన బాధ్యత. సింహాసనాన్ని అధిరోహించడానికి వచ్చే అవకాశాలను మనం చేజార్చుకుంటే మనకు ఆశలు సన్నగిల్లుతాయి. తద్వారా పోరాడే జనసైనికుడు అలసిపోయి నీరశిస్తాడు. మనం త్యాగం చేసింది ఒక్క జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికలు మాత్రమే కాదు… 2014 లో నిస్వార్థంగా పోటీ చేయకుండా ఆగిపోయాము. 2019 లో అస్తవ్యస్తంగా జరిగిపోయింది. ఇపుడు జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికలు.. ఇలా ప్రతిసారి మనల్ని మనమే కోల్పోతున్నాం. ఇకనైనా ఇంచార్జులను నియమించి, తద్వారా జనసైనికులకు అండగా నిలిచే వ్యవస్థ కావాలని కోరుకుంటూ ఓ జనసైనికుడిని… 

By

ట్విట్టర్ ఐడి : @ForJanata

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way