పాడేరు ( జనస్వరం ) : చింతపల్లి, బెన్నవరం గ్రామస్తుల పిలుపు మేరకు ఆ గ్రామాన్ని సందర్శించిన జనసేనపార్టీ పాడేరు ఇన్చార్జ్ డా..గంగులయ్య. ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ గ్రామాల పరిస్థితులు, అభివృద్ధి అనేమాటలు కేవలం పేపర్లలో మాత్రమే కానీ వాస్తవ రూపంలో కనిపించటం లేదన్నారు. ప్రధాన సమస్య తాగునీటి ఎద్దడి ఉందన్నారు. అయితే సుమారు 25లక్షలతో జలజీవన్ మీషన్ ఏర్పాటు చేసి గ్రామానికి తాగు నీటి అందించే ఏర్పాటు ఉన్నప్పటికీ నిర్మాణంతో సరిపెట్టారు కానీ ఇప్పటిదాకా ప్రారంభం చేసిన పాపాన పోలేదు. ఇదేమి వైఖరంటూ గంగులయ్య ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ప్రజాధనం వృధా చేయడమంటే ఇదే ఇటువంటి పనులు ఎలా చేయగలుగుతున్నారన్నారు. మేము నియోజకవర్గ పరిధిలో చాలా గ్రామాలను సందర్శంచాం. మార్పు కోసం అదివాసి ప్రజలు ఆలోచన చేస్తుందన్నారు. విద్యావంతులైన యువత ఎంతో వేదనతో ఉన్నా కూడా మన ప్రాంతం మన ప్రజలు వారి స్థితిగతులపై సంపూర్ణంగా అవగాహన ఉన్న యువకులు నేడు గ్రామాల్లోని వున్నారు. కారణం ప్రభుత్వాలు వారికి సరైన ఉపాధి కల్పించకపోగా వారి ఉద్యోగాలకు కల్పతరవులాంటి జీవోలు రద్దు చేస్తున్న కూడా స్పందించట్లేదు. ప్రభుత్వం అటువంటి కారణాల చేత నేడు గిరిజన యువత మొత్తం జనసేనపార్టీ తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. గద్దె దించేందుకు తమ శక్తివంచన లేకుండా పోరాడుతున్నారు. మా యువకులకు రాజకీయ అనుభవాలు లేకపోవచ్చు. కానీ గిరిజన ప్రాంతాలను, హక్కులను, చట్టాలనుఎలా రక్షించుకోవాలనే విషయంలో పోరాటపటిమని కనబరిసే సంకల్పం ఉందన్నారు. మీ గ్రామం మార్పు కొరకు ఆలోచన చెయ్యడం శుభసూచకం మీరు మమ్మల్ని స్వయంగా ఆహ్వానించారు. మీ ఆలోచన తీరు ఏమిటో ఇప్పుడు గిరిజన ప్రజలకు తెలుస్తుందన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మీరంతా మార్పుకోసం జనసేనపార్టీ ప్రభుత్వ స్థాపన కోసం కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో జనసేనపార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులైన వైసీపీ, కాంగ్రెస్ సానుభూతిపరులు బెన్నవరం గ్రామస్తులకు డా..గంగులయ్య జనసేనపార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగ ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తంగుల రమేష్, లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్, వంతల బుజ్జిబాబు, మసాడి భీమన్న, మసాడి సింహాచలం, దేపురు రాజు, వంతల రాజారావు, కొర్ర భానుప్రసాద్, మజ్జి నగేష్.భాస్కరరావు, రాజారావు, బిల్లా, తదితర జనసైనికులు గ్రామస్తులు పాల్గొన్నారు.