Logo
Date of Publish : 12 August 2020, 4:36 pm
Editor : Sake Naresh

ఇసుక రీచ్ లు ఏర్పాటు చేసి, ఇసుక కొరత తీర్చకపోతే నిరాహార దీక్ష చేస్తామన్న ఇచ్చాపురం జనసైనికులు

ఇసుక రీచ్ లు ఏర్పాటు చేసి, ఇసుక కొరత తీర్చకపోతే నిరాహార దీక్ష చేస్తామన్న ఇచ్చాపురం జనసైనికులు

                శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం నియోజకవర్గ౦లో ఇసుక అందుబాటులో లేకపోవటంతో భవన నిర్మాణ కార్మికులు చాలా కష్టాలు పడుతున్నారు. వారిని కష్టాలు నుండి గట్టు ఎక్కించాలి అంటే ఇసుక అందుబాటులోకి తేవాలి. ఈ ఇసుక కొరతతో మరెందరో కార్మికులు ఉపాధి కోల్పోయి పూట గడవడం కష్టంగా మారింది. ఇలా కార్మికులు కష్టాలు బారినపడకుండా ఇసుక రీచ్ లను ఏర్పాటు చెయ్యాలి అని పలుమార్లు దాసరిరాజు గారు ఇచ్చాపురం తహసీల్దార్ గారికి వినతిపత్రం అందించి కోరుకోవటం జరిగింది. కానీ అధికారులలో ఎటువంటి స్పందన కనబడకపోవడంతో ఇచ్చాపురం MPDO గారికి వినతిపత్రాన్ని అందించి సమస్యను పరిష్కరించాలని ఇచ్చాపురం జన సేన పార్టీ సమన్వయకర్త దాసరిరాజు గారు కోరడం జరిగింది. రానున్న మూడు రోజుల్లో ఇసుక రీచ్ లు ఏర్పాటు చేసి ఇసుక కొరత తీర్చకపోతే ఆగస్ట్15వ తేదీన ఇచ్చాపురంలో జనసేన పార్టీ తరుపున నిరాహారదీక్ష చేపడతామని దాసరిరాజు గారు స్పష్టం చేశారు. ఉదయం తొమ్మిది గంటలు నుండి సాయంత్రం 5 గంటలు వరకు నిరాహారదీక్ష చేపడతామని దాసరిరాజు గారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తిప్పనదుర్యోధన రెడ్డి, సంతోష్ మహరణ, ఢిల్లీ బిసాయి, భాస్కర్ రావు, దాసరి శేఖర్, అఖిరా, సాయి తులసి దాస్, మణి, రవి తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com