గాజువాక ( జనస్వరం ) : జనం వద్దకు జనసేన అనే నినాదంతో ప్రజా సమస్యలు తెలుసుకోవటానికి 87వ వార్డు వడ్లపుడి, కణితి ఆర్ హెచ్ కాలనీలు, దిబ్బపాలెం, అప్పికొంఠ, సిద్దార్దనగర్, తిరుమల తిరుపతి నగర్ ప్జనసేన PAC సభ్యులు, గాజువాక ఇంచార్జి కోన తాతారావు 87వ వార్డు అధ్యక్షులు సిరిసిల్లి కనకరాజు సారాధ్యంలో పాదయాత్ర చేపట్టారు. యువతకు ఉపాధిలేక ప్రతి ఇంటిలోనూ ఒక్కరు పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళటం, ఎక్కడ చూసినా అద్వానమైన రోడ్లుతో ప్రజలు సమమతం అవుతున్నారని, అడ్డు అదుపులేకుండ నిత్యావసరాల ధరలు పెరుగుదల,కొనుగోలు శక్తి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూరని పాదయాత్ర లో నేరుగా కనిపించాయి తాతారావు గారు అన్నారు. విశాఖ ఉక్కు నిర్వాసితులకు అన్ని విధాలుగా న్యాయం చేస్తామని, ఉపాధి కల్పించి అందరి కుటుంబాలను ఆదుకూంటాం అని తెలిపారు. వైసిపి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేని కారణంగా గుడ్ బై చెప్పాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రజలు ఉన్నారని, జనసేన – టిడిపి ల సారథ్యంలో ప్రభుత్వం రావాలనే ఆశతో ప్రజలు ఎదురు చూస్తున్న తరుణంలో త్వరలో వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గార్ని ఆదరించి గాజు గ్లాస్ కు ఓటు వేయాలని ఇంటింట ఇంటింటా ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గడసాల అప్పారావు, దల్లి గోవింద్ రెడ్డి, గొన్న రమాదేవి, చిన అప్పారావు, కాద శ్రీను, లంకల మురళి దేవి, రౌతు గోవిందరావు, జ్యోతి రెడ్డి, లంక లత, 87వ వార్డు జనరల్ సెక్రటరీ భాస్కర్ రాజు, ఉపాధ్యక్షులు కర్రి నర్సింగ రావు, కరణం వేణు గోపాల్, ఇందిర ప్రియదర్శిని, శ్రీనివాస్, సునీల్, జగదీష్, శ్రీధర్, స్వరాజ్, శేషు, నూకరాజు, అప్పారావు పాల్గొన్నారు.