Logo
Date of Publish : 02 October 2020, 10:15 am
Editor : Sake Naresh

సీతానగరం నూతన బ్రిడ్జి నిర్మాణం వెంటనే నిర్మించాలి అంటూ జనసైనికుల అర్ధనగ్న ప్రదర్శన

సీతానగరం నూతన బ్రిడ్జి నిర్మాణం వెంటనే నిర్మించాలి అంటూ జనసైనికుల అర్ధనగ్న ప్రదర్శన                           సీతానగరం బ్రిడ్జిపై మండల జనసేన నాయకులు అర్థనగ్న నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు శివశంకర్ పోతల మాట్లాడుతూ సెప్టెంబర్ నెల 17వ తారీఖున బ్రిడ్జిపై నిరసన తెలుపుతూ ప్రభుత్వంకి అక్టోబర్ 1వ తారీఖు వరకు టైమ్ ఇచ్చాము అని కానీ ఇంత వరకు కూడా ప్రభుత్వం కానీ, స్థానిక నాయకులు కానీ స్పందించలేదు అని, ఇలాగే నాయకులలో కదలిక రాకపోతే ఈ నిరసన ఉద్యమరూపం దాల్చుతుంది అని అలాగే మేము చేసేది న్యూసెన్స్ కాదని మేము చేసేది ప్రజల కోసం, ప్రజల మంచి కోసం చేస్తున్నాము అని స్థానిక ప్రభుత్వ నాయకులు గమనించాలి అని సూచించారు అలాగే జనసైనికులు మాట్లాడుతూ 1936లో బ్రిటిష్ వాళ్ళు నిర్మించిన బ్రిడ్జిని ఈ ప్రభుత్వాలు మరమ్మత్తులు చేసుకుంటూ వస్తుంది. ఎన్ని సార్లు మరమ్మత్తులు చేసినా ఫలితం శూన్యం. ఇక్కడ మరమ్మత్తుల పేరుతో అధికారులు, నాయకులు, కాంట్రాక్టర్లు లబ్ది పొందుతున్నారు కానీ ప్రజలకు మంచి జరగడం లేదు. వెంటనే నూతన బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని అలాగే ఎప్పటినుండి బ్రిడ్జి పనులు మొదలు పెడతారో ఒక స్పష్టత ఇవ్వాలని మొన్న మరమ్మత్తులకు కేటాయించిన నిధులు ఎవరి జేబులోకి వెళ్లాయని లెక్కలు చెప్పాలని జనసేన పార్టీ మండల నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో పార్వతీపురం నాయకులు బాబు పాలూరి, అనిల్ చందాకా, విజయ్, సురేష్ మరియు మండల జనసైనికులు సూర్యనారాయణ, సత్యనారాయణ, వెంకటరమణ, సంతోష్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com