Search
Close this search box.
Search
Close this search box.

ప్రచార ఆర్భాటాలే కాని ప్రభుత్వ పనితీరు క్షేత్రస్థాయిలో ఏమాత్రం కనిపించడం లేదు : పెండ్యాల శ్రీలత

పెండ్యాల శ్రీలత

         అనంతపురం ( జనస్వరం ) :  జనసేన పార్టీ ఆధ్వర్యంలో 12,13,14 తేదీలలో నిర్వహించు జగనన్న ఇల్లు-పేదలందరికీ కన్నీళ్లు అనే సామాజిక పరిశీలన కార్యక్రమంలో భాగంగా 12వ తేది మొదటిరోజు రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత అనంతపురం జిల్లాలోని ఆలమూరు, నారాయణపురం పంచాయతీలలోని అవినీతి వైసీపీ ప్రభుత్వము ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలని పరిశీలించి అక్కడ పరిస్థితులను తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పెండ్యాల శ్రీలత మాట్లాడుతూ ఆలమూరు జగనన్న కాలనీ ఏర్పాటుకు 5 లక్షల విలువ చేసి ఎకరా భూమికి 20 లక్షలు వెచ్చించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ 187 ఎకరాల భూమిని కొనుగోలు చేసి 120 ఎకరాలలో మాత్రమే 7వేళ ఇళ్ళ పట్టాలు ఇచ్చి మిగిలిన భూమిని వైసీపీ నాయకులు తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. అనంతపురం ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి గారు 2 సంవత్సరం క్రింద 7వేళ ఇళ్లకు భూమి పూజ చేసి ఇప్పటి వరకు 2వందల ఇళ్లనుకుడా పూర్తి చేయకుండ అభివృద్ధిని గాలికి వదిలేశారు. ఇక్కడ పూర్తిగా కొండ ప్రాంతంలో ఇళ్ల స్థలాలు కేటాయించి ఆ కొండలో ఉన్న ఎర్ర మట్టిని సైతం చదును చేస్తున్నామని చెప్పి అక్రమంగా అమ్ముకున్నారని, గునాదిలేకుండ ఇల్లును నిర్మిస్తున్నారని నసిరకమైన ఇసుక, పేల్లలు, సిమెంట్ వినియోగించి కేవలం ఒక సెంట్ లో మాత్రమే ఇల్లు నిర్మిస్తున్నారని ఈ ఇల్లు పేద ప్రజలకు ఏమాత్రం నివాసయోగ్యంగా లేదని శ్రీలత తెలియ జేశారు. ఇక్కడ స్థానికులను అడగ్గా ఇక్కడ మాకు కనీసం మౌలిక సదుపాయాలైన విద్యుత్,నీరు,రవాణా సౌకర్యం కూడా ఇక్కడ లేదని ఇంటి పునాది వేయాలంటే 50వేళ రూపాయలు ఇవ్వాలని కాంట్రాక్టర్లు అడుగుతున్నారని మేము డబ్బులు ఇవ్వలేము అంటే కనీసం 35వేలు అయినా ఇవ్వాలని మమ్మలి డిమాండ్ చేస్తున్నారని వాపోయారు. అనంతరం నారాయణపురం పంచాయతీలోని కాలనీని పరిశీలించి అక్కడ పరిస్థితిని తెలుసుకున్నారు. 
           పంచాయతీ పరిధిలోని జగనన్న కాలనీని పరిశీలించి అక్కడ పరిస్థితిని తెలుసుకొని జనావాసం లేని ప్రాంతంలో నగరానికి నాలుగు కిలోమీటర్ల దూరన కరెంటు సౌకర్యం, రోడ్డు సౌకర్యం, నీటి సౌకర్యం మౌలిక సదుపాయాలు లేని విష సర్పాలు సంచరించే గుట్ట ప్రాంతంలో 2 ఎకరాల భూమిలో 110 ఇండ్ల పట్టాలు రెండు సంవత్సరాల క్రితం ఇచ్చి ఇల్లు కట్టుకోమంటున్నారని అయితే ఇక్కడ ఇంకా పది ఇల్లు కూడా పూర్తి కాలేదని ఇక్కడ స్థానికులను మేము అడగ్గా ఇక్కడ ప్రభుత్వం స్థలం అయితే ఇచ్చింది కానీ మాకు బిల్లులే సరిగా పడలేదని ఇసుకతో చాలా ఇబ్బందిగా ఉందని ఇసుక కొనడానికి 50వేళ రూపాయలవరకు కర్చు ఔతుందని అప్పుచేసి ఇల్లు కట్టుకుంటున్నామని అయితే మేము ఇంటికి అప్లై చేసుకున్నప్పుడు ఇల్లు ప్రభుత్వమే కట్టి ఇవ్వమని ఆప్షన్ ఇచ్చామని తీరా ఇప్పుడు కట్టుకుంటే మీరు కట్టుకోండి లేదంటే పట్టని వెనక్కి తీసుకుంటామని బెదిరిస్తున్నారని పట్టా వెనక్కి తీసుకుంటారన్న భయంతో మేము ఇల్లు కట్టుకోవడం ప్రారంభించగా మాకు బిల్లులు సరిగా పడక ఇప్పుడు మా ఇంటికి 7 లక్షల రూపాయలు అయిందని ప్రభుత్వం ఇచ్చే ఒక లక్ష ఎనభై వేల రూపాయలు ఏమాత్రం సరిపోవని వారు వాపోయారు.ఈకార్యక్రమంలో రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పసుపులేటి పద్మావతి, జిల్లా కార్యదర్శి కాశెట్టి సంజీవ రాయుడు, ప్రధాన కార్యదర్శి పెండ్యాల చక్రపాణి,అనంతపురం రూరల్ కన్వీనర్ గంటా రామాంజనేయులు, వీర మహిళలు శ్రీమతి గుమ్మడిసాని శిల్పా, వాణి, కుళ్ళయమ్మ, దార్భి, శైలజ, సరదగ, వరలక్ష్మి గారు, అనసూయ, నాయకులు కొండిశెట్టి ప్రవీణ్ కుమార్, దండు హరీష్ కుమార్, మధు, వన్నుర్, పవన్, ఉత్తేజ్ తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way