చిత్తూరు ( జనస్వరం ) : ఐరాల మండలం, వేదగిరివారిపల్లి పంచాయతీ, గూబలవారిపల్లి గ్రామానికి చెందిన చెల్లే కోటీశ్వరయ్య, శివకుమార్, సుబ్రమణ్యం, పద్మనాభం, చంద్రమణి, గురవయ్య, వర్దం కోటి తదితర రైతులకు చెందిన మామిడి, వరి, కొబ్బరి, అరటి పంటలను ఏనుగుల గుంపు శనివారం రాత్రి ద్వంసం చేశాయి. సదరు పంటలను ఆదివారం జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి ఏపీ శివయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది కాలంలో పలు మార్లు ఏనుగులు పంటపొలాలను ద్వంసం చేయగా బాధిత రైతులు పంట నష్ట పరిహారం కొరకు ప్రభుత్వానికి ధరఖాస్తులు చేసి సంవత్సర కాలం పూర్తయినా నేటికీ పరిహారం చెల్లించకుండా బాధిత రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు . రైతే రాజు, దేశానికి రైతే వెన్నుముఖ అని గొప్పలు చేప్పే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతుల సమస్యలును గాలికొదిలేశారనడానికి ఈ ఘటనలు నిలువెత్తు నిదర్శనం అన్నారు. ఏనుగుల దాడిలో పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి ఇరవైవేల రూపాయలు నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు తగు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఐరాల మండల అధ్యక్షులు కే పురుషోత్తం, మండల కార్యదర్శి గూడేలు త్యాగరాజులు, మాజీ వార్డు సభ్యులు గూడేలీ చంద్రమౌళి, చెల్లె శివకుమార్, చెల్లె హరిప్రసాద్ గ్రామస్తులు జనసైనికులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com