రాజోలు ( జనస్వరం ) : రాజోలు నియోజక వర్గం బి సావరం గ్రామంలో రైతు బరోసా కేంద్రం సాక్షిగా జరుగుతున్న నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నదాత ఆక్రందన. ఇటీవల కాలంలో కురిసిన అకాల వర్షాలు కారణంగా చేతికి అందిన వరి పంట పూర్తిగా తడిసిపోయి మొలకలు వచ్చిన సంఘటన వెలుగు చూసింది. రాజోలు జనసేన పార్టీ నాయకులు బొంతు రాజేశ్వర రావు గారి దృష్టికి ఆ ప్రాంతం రైతులు తీసుకు వెళ్లగా ఆయన వెంటేనే స్పందించి పంట నష్టపోయిన రైతులను కలిసి వారికి దైర్యాన్ని ఇచ్చారు. రైతు కంట కన్నీరు పెట్టించిన గత ప్రభుత్వాలు ఏమైనయో చూసి కుడా వైసీపీ ప్రభుత్వం కళ్ళు తెరవాలి అని అయన హితవు పలికారు. రైతుకి గిట్టుబాటు ధర కల్పించాలి అని కోరారు. తడిసిన బస్తాకి 1550 రూపాయల నుంచి 1670/- వరకు ధర కల్పించాలి అని కోరారు. వరి పంట పూర్తిగా తడిసి మొలకలు వచ్చి పంట పూర్తిగా నష్టపోయిన రైతులకు ఏకరాకు కనీసం 35వేల వరకు పంట నష్ట పరిహారం క్రింద చెల్లించి రైతులను ఆదుకుని ఆత్మహత్యలకు గురికాకుండా చూడాలి అని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం సకాలంలో స్పందించక పోతే భవిష్యత్తులో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి, భవిష్యత్తులో రైతు తమ మద్దతు దర కోసం జనసేన పార్టీ పెద్ద యెత్తున ఉద్యమాలు చేస్తుంది అని వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు. రైతాంగానికి ప్రకృతి విపత్తులు సంభవించిన్నప్పుడు విడుదల చేయవలసి ఫండ్ నీ వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం తీరు చూస్తుంటే ఏరూ దాటాక తెప్ప తగలేసే లా ఉందని అన్నారు . రైతులను ,రైతు కుటుంబాలను పరామర్శించి ఆదుకోవాలి అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం లో రాజోలు తాలూకా జనసైనికులు, రైతులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.