Search
Close this search box.
Search
Close this search box.

అగ్నిప్రమాదంలో గుజరి దగ్ధం బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

    అనంతపురం ( జనస్వరం ) : నగరంలోని ఎన్టీఆర్ మార్గ్ రోడ్డులో ఉన్న గుజిరి షాప్ లో ఆదివారము తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విషయం తెలుసుకున్న అనంతపురము జనసేన జిల్లా అధ్యక్షులు, అర్బన్ ఇంచార్జ్ టి.సి వరుణ్ వెంటనే బాధితులను పరామర్శించి సంఘటనకు గల కారణాలను తెలుసుకోవాలని జనసేన నగర అధ్యక్షులు పొదిలి బాబురావు, జిల్లా సహాయ కార్యదర్శి అవుకు విజయకుమార్, నాయకులు పవనిజం రాజుకు సూచించారు. అనంతరం ప్రమాద ఘటన స్థలాన్ని సందర్శించి గుజిరి షాపు యజమాని లలిత గారిని పరామర్శించి, మీకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ఈ అగ్నిప్రమాదం వల్ల దాదాపు రూ.80 లక్షల వరకు నష్టం సంభవించిందని ఆమె వాపోయారు. జనసేన నగర అధ్యక్షులు  పొదిలి బాబురావు గారు మాట్లాడుతూ… ప్రభుత్వం మానవత దృక్పథంతో బాధితులకు పరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way