Logo
Date of Publish : 21 July 2023, 10:42 pm
Editor : Sake Naresh

డ్రైనేజీ వ్యవస్థను రిపేర్ చేయించే విషయంలో ప్రభుత్వం మొద్దు నిద్రను వీడాలి

         శేరిలింగం పల్లి ( జనస్వరం ) : నియోజవర్గ ఇంచార్ట్ Dr. మాధవ రెడ్డి గారి ఆధ్యర్యంలో లింగంపల్లి అండర్ పాస్ మరియు చందానగర్ అండర్ పాస్ బ్రిడ్జీలను సందర్శించటం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలకుంట్ల తారకరామా రావు గారు ప్రొద్దున లేస్తే హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దామని ప్రగల్భాలు పలికే ప్రభుత్వ పెద్దలు వాస్తవానికి సామాన్యులు, బీద, బడుగు బలహీన వర్గాల జీవన విధానాల్లో మెరుగు పడటం కోసం అయితే ఎటువంటి కృషి చేయడం లేదు. మన శేరిలింగం పల్లి నియోజక వర్గం నుండి అయితే పన్నుల రూపంలో రాష్ట్రంలో అధిక ఆదాయం మన నియోజకవర్గం నుండి చెల్లిస్తున్నాం, కాని శేరిలింగం పల్లి అభివృద్ధికి కేటాయించాల్సిన నిధులు అయితే కేటాయించటం లేదు. మధ్యతరగతి ప్రజలకు కనీస అవసరాలను తీర్చటంలో కూడా ప్రభుత్వం విఫలమౌతున్నది. లింగంపల్లి మరియు చందానగర్ అండర్ పాస్ ల ద్వారా రోజుకు వేలాది మంది ప్రయాణిస్తున్నారు. అయితే వర్షాలు వచ్చినప్పుడల్లా రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతున్నది. ఇదే విషయాన్ని వినతి పత్రాల ద్వారా ఇప్పటికే 4, 5 సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకు పోయినప్పటికీ, అధికార యంత్రాంగం మొద్దు నిద్ర వీడటం లేదు, వేసవి కాలం లో సైతం ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి తీసుకు వెళ్ళినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించటం చూస్తే ప్రభుత్వానికి ప్రజల పట్ల ఉన్న శ్రద్ద ఎంటో తేటతెల్లం అవుతుంది. ఎన్నికల సమయాల్లో కాకుండా ఇటువంటి సమయాల్లో శేరిలింగం పల్లి MLA గారు నియోజకవర్గం అంతా తిరిగితే ప్రజలు సమస్యలు తెలుస్తాయని హితవు పలికారు. వెంటనే లింగంపల్లి మరియు చందానగర్ అండర్ పాస్ ల డ్రైనేజ్ వ్యవస్థను రిపేర్ చేయించి, శాశ్వత పరిష్కారం కొరకు ఆలోచనలు చేయాలని, ఈ సమస్యకు పరిష్కారాలను చూపాలని డిమాండ్ చేసారు. లేని యెడల రానున్న రోజుల్లో జనసేన పార్టీ ఆధ్యర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలను నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ శేరిలింగంపల్లి నాయకులు బి.అరుణ్ కుమార్, కళ్యాణ్ చక్రవర్తి, హనుమంతు నాయక్, పుష్ప, స్వామి మరియు ఇతర జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com