ఎమ్మిగనూరు ( జనస్వరం ) : విష సర్పాలు కనపడితే ఆమడ దూరంలో పరిగెత్తే వారికి మనోధైర్యాన్ని కల్పిస్తూ వాటిని చంపడం నెరమంటూనే సమాజంలో ప్రజలు పాటించే జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్న గోనెగండ్ల మండల కేంద్రానికి చెందిన పాముల అజీజ్ అక్బర్ సేవలను వెలకట్టలేమని అలాంటి వారి సేవలు కొనసాగేలా ప్రభుత్వం గుర్తించి రక్షణ కిట్లు పంపిణీ చేసి ప్రోత్సహించాలని జనసేన పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జి రేఖగౌడ్ తెలిపారు. మండల కేంద్రమైన గోనెగండ్లలో ఆదివారం రోజు అజీజ్ అక్బర్ లను శాలువతో సత్కరించి సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ సర్పం ఏదైనా విషపూరితమేనని భావించి పాముకాటుకు గురైన వారు భయనికే ప్రాణాలు కోల్పోతున్నారని గ్రహించి ఎవ్వరు పాముకాటు వలన ప్రాణాలు కోల్పోరాదనే గొప్ప లక్ష్యంతో ప్రజలకు విషసర్పాల గురించి అవగాహన కల్పిస్తూ వారి ప్రాణాలను పణంగా పెట్టి జనవాసాల్లో కనపడే పాములను పట్టుకొని అడవుల్లో వెళ్లి వదిలేయడం చాలా కష్టసాధ్యం కాని ఎవరి దగ్గర ఏమి ఆశించకుండానే వారి ప్రాణాలకు రక్షణ లేదని తెలిసిన ప్రజల ప్రాణాలను రక్షించాలనే తపనతో ఎంతో అనుభవపు మెలకువలతో విష సర్పాలను అవలీలగా పట్టుకొనే అజీజ్ అక్బర్ లాంటి వారిని ప్రభుత్వం గుర్తించి రక్షణ పరికరాలు పంపిణీ చేసి అదుకోవాలన్నారు. ప్రభుత్వం సహకారం అందిస్తే సామాన్య ప్రజలు పాముకాటు భారిన పడి మరణించే వారి సంఖ్య తగ్గుముఖం పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వారి సేవలను ప్రశంసిస్తూనే విష సర్పాలు పట్టే సమయంలో ఖచ్చితంగా రక్షణ వుండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గానిగ బాషా, మాలిక్, రవికుమార్, మల్లి, వెంకటేష్, మునాఫ్, మబ్బాషా, ఇబ్రహీం,వినోద్, సాధిక్,పులికొండ, మహమ్మద్, ఖాసీంవలి, పాల్గొన్నారు,
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com