Logo
Date of Publish : 09 December 2023, 6:59 pm
Editor : Sake Naresh

తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి

         అనంతపురం ( జనస్వరం ) : 20 రోజుల ముందే తుఫాను వస్తుందని హెచ్చరిక తెలిసినా? వ్యవసాయ శాఖ అధికారులు సరైన సమయంలో తగిన చర్యలు తీసుకోకపోవడం వలన, ప్రభుత్వ పెద్దల నిర్లక్ష్యం వలన, రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆరుకాలం శ్రమించి పండించిన పంట, పొలాలన్నీ తుఫాను తీవ్రతకు తీవ్రంగా దెబ్బతిని రైతులు నష్టపోవడం చాలా బాధాకరమని జిల్లా ఉపాధ్యక్షులు జయరాంరెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం తుఫాను తీవ్రతకు పంట నష్టపోయిన అన్ని పంటల రైతులకు ప్రతి ఎకరాకు 20,000 తక్కువ కాకుండా నష్టపరిహారం అందించాలి. కల్లాలలో తుఫాను తీవ్రతకు తడిచిన ధాన్యాన్ని షరతులు లేకుండా, రాష్ట్ర ప్రభుత్వం భేషరతుగా ధాన్యాన్ని సేకరించి రైతులకు తగిన నష్ట పరిహారం అందించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నిన్నటి రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన విధానం చూస్తే.. జగన్మోహన్ రెడ్డి గారికి రైతుల ఎడల ఎంత చిత్తశుద్ధి ఉందో? స్పష్టంగా అర్థం అవుతుంది. పంట నష్టపోయిన పంట పొలాల దగ్గరికి వెళ్లకుండా కేవలం రోడ్లపై కొంతమంది రైతులని పిలిపించుకొని పరామర్శించిన తీరు చాలా బాధాకరం. మాయ మాటలు కల్లిబొల్లి మాటలు చెప్పకుండా, ప్రకటనలకే పరిమితం కాకుండా తక్షణమే పంట నష్టపోయిన అన్ని పంటల రైతుల అందరికీ పంట నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా దారుణ పరిస్థితులు నెలకొన్నాయి పంట పెట్టే సమయంలో అనావృష్టి కారణంగా సకాలంలో వర్షాలు కురువకపోవడం వలన కొంతమంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరి కొంతమంది రైతులు ఆరుకాలం శ్రమించి పంట చేతికొచ్చిన సమయంలో తుపాను ప్రభావం వలన పంట పండించిన రైతులు పూర్తిగా నష్టపోయారు. పంట నష్టపోయిన రైతులందరూ తీవ్ర ఒత్తిడిలో ఇంకా మేము ఎలా బతికేది అని మనోవేదనతో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సహాయ సహకారాలు అందించి రైతులందరికీ భరోసా కల్పించి నష్టపరిహారం చెల్లించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని అన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com