- మైలవరం నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జి అక్కల రామ్మోహన్ (గాంధీ)
ఇబ్రహీంపట్నం, (జనస్వరం) : ఇటీవల కృష్ణా నది వరద ప్రవాహానికి ముప్పుకు గురైన కొటికలపూడి, దామలూరు, చిలుకూరు, మూలపాడు, కేతనకొండ గ్రామాలకు చెందిన రైతులను కలసి వారితోపాటు పంట నష్టం వాటిల్లిన పొలాలను మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి అక్కల రామ్మోహన్ (గాంధీ) సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట నష్టంవాటిల్లిన రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చింతలక్ష్మీ, ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షులు పోలిశెట్టి తేజ, కొటికలపూడి గ్రామ అధ్యక్షులు కట్టా శ్రీనివాస్, కళ్యాణ్, కొమ్మూరు వెంకటస్వామి, బాల, కొమ్మూరి హనుమంతరావు, ఎతి రాజుల ప్రవీణ్, సుజాత, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com