Logo
Date of Publish : 14 December 2023, 9:25 pm
Editor : Sake Naresh

అంగన్ వాడీ వర్కర్ల న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలి

     అమలాపురం ( జనస్వరం ) : అంగన్వాడీ వర్కర్ల కనీస వేతనం 26 వేలు చేయాలని, రిటైర్మెంట్ వయస్సు పరిమితి 62 సంవత్సరాల వరకు పెంచాలని, అంగన్ వాడీ ఆయాలను టీచర్లుగా ప్రమోట్ చేయాలని, అంగన్ వాడీ వర్కర్లు అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారు ధర్నా చేస్తున్న సంగతి తెలిసిందే. సుప్రీమ్ కోర్ట్ తీర్పు ప్రకారం అందరికీ గ్రాడ్యుటీ ఇవ్వాలని, భీమా సౌకర్యం కల్పించాలని, అంగన్ వాడీ సెంటర్లలకు నాణ్యమైన సరకులు సరఫరా చేయాలనే తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ గత మూడు రోజులుగా స్థానిక అమలాపురం ఐ సి డి ఎస్ కార్యాలయం ఎదుట సమ్మె చేస్తున్న అంగన్ వాడీ వర్కర్ల శిబిరాన్ని జనసేనపార్టీ అమలాపురం నియోజకవర్గం ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు సందర్శించారు. వారికి నైతిక మద్దతు తెలియజేయడం జరిగింది. శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ అంగన్ వాడీ వర్కర్ల న్యాయమైన డిమాండులను ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని అంగన్ వాడీ వర్కర్ల న్యాయమైన డిమాండులను ప్రభుత్వం నెరవేర్చే వరకు వారు చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందని అన్నారు. వారికి హామీ ఇవ్వడం జరిగింది. త్వరలోనే జనసేన తెలుగు దేశం ప్రభుత్వం రానుందని మా ప్రభుత్వం వచ్చినవెంటనే అంగన్ వాడీ వర్కర్ల న్యాయమైన డిమాండులను పరిష్కరిస్తామని రాజబాబు గారు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ ప్రధానకార్యదర్శి సందాడి శ్రీనుబాబు, పార్టీనాయకులు మోకా బాలయోగి, ఆకుల బుజ్జి, పొణకల ప్రకాష్, గండి స్వామి, కుంపట్ల రమేష్, ముత్తాబత్తుల శ్రీను, అర్లపల్లి దుర్గ, ఈతకోట వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com