Logo
Date of Publish : 07 February 2024, 9:43 pm
Editor : Sake Naresh

రాష్ట్ర ప్రగతికి బడ్జెట్ లో ఏమాత్రం తావివ్వని వైకాపా ప్రభుత్వం

    అనంతపురం ( జనస్వరం ) :  జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ శ్రీమతి పెండ్యాల శ్రీలత గారు మహిళలతో మాటామంతి కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా 24వ రోజు అనంతపురం రూరల్ పంచాయతి బైరవనగర్ లో పర్యటించి స్థానిక మహిళలతో మమేకమయ్యి సమస్యలు తెలుసు కొని ఈ విధంగా మాట్లాడారు... రాష్ట్రం అష్ట కష్టాల్లో ఉంటే ఎన్నికల ముందు ప్రవేశపెట్టే బడ్జెట్ ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని ఆర్థిక నిపుణులు,ప్రజలు భావించారని కానీ వారు నిరాశపడేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డొల్లతనంగా ఎన్నికలే లక్ష్యంగా బడ్జెట్ ను రూపొందించారు తప్ప రాష్ట్ర గతి,ప్రగతిని ఏమాత్రం పట్టించుకోలేదని ఆమె మండిపడ్డారు.. స్పష్టమైన అభివృద్ధి నమూనాను ఆవిష్కరిస్తారని ఆశించిన వారికి బడ్జెట్ నిరుత్సాహపరిచిందని దుయ్యబట్టారు. రెవెన్యూ రాబడులకంటే రెవెన్యూ వ్యయం ఎక్కువగా చూపిన ఈ బడ్జెట్ లో ధరలు మరింతపెరిగి మధ్యతరగతి ప్రజల వినియోగం పై మరింత భారం పడే అవకాశముందని అన్నారు. అప్పులు తెచ్చి నడిపే పథకాలు తప్ప ఆదాయ సృష్టి జరిగే మార్గం చూపలేదని వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రవేశపెట్టిన ప్రతి బడ్జెట్ లో కీలకమైన అన్ని రంగాలను తీవ్ర నిర్లక్ష్యం చేసిందని అన్నారు. ఇది రాష్ట్ర బడ్జెట్ కాదని జగన్ రెడ్డి వ్యక్తిగత బడ్జెట్ అని ఆమె విమర్శించారు. వీటితో పాటు ఇక్కడ స్థానికంగా మౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా ఉందని రాష్ట్ర గతిని మార్చి ఆంధ్ర ప్రదేశ్ ను స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా మార్చాలంటే జనసేన టీడీపీ పార్టీలకు ప్రజలు ఓటు వేసి ప్రభుత్వ స్థాపనకు తోడ్పడాలన్నారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com