Logo
Date of Publish : 20 September 2023, 9:52 pm
Editor : Sake Naresh

ఆంధ్ర రాష్ట్ర ప్రజల సంక్షేమం, భావితరాల భవిష్యత్తే జనసేన లక్ష్యం

        పామిడి ( జనస్వరం ) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకునే ఏ నిర్ణయమైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, భావితరాల పిల్లల భవిష్యత్తు కోసం మాత్రమేనని, జనసేన నాయకుడు తీసుకునే ఎటువంటి నిర్ణయానైనా జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు కచ్చితంగా స్వాగతిస్తారని పామిడి మండల అధ్యక్షులు యం.ధనుంజయ అన్నారు. ఆయన ఆశయాల కోసం తను తీసుకునే నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తారని అన్నారు. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి గుంతకల్లు నియోజకవర్గంలో గెలుపు కోసం బలంగా పోరాడుతాం ధైర్యంగా ముందుకెళ్తామని, రాష్ట్రంలో రౌడీయిజం, గుండాయిజం, పెరుగుతోందని ప్రశ్నించిన వారిపై దాడులు, బెదిరింపులు, పోలీసులతో అరెస్టులు చేయిస్తూ జగన్ ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తుందని అన్నారు. రానున్న రోజుల్లో వైసిపి ప్రభుత్వాన్ని గద్దేదించేందుకు ఖచ్చితంగా బిజెపి, జనసేన, తెలుగుదేశం కలిసి పోటీ చేసి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పరుస్తాయని ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రతిపక్షాల ఐక్యతతో మాత్రమే సాధ్యమని ధనుంజయ పేర్కొన్నారు..


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com