Logo
Date of Publish : 26 January 2022, 10:03 am
Editor : Sake Naresh

స్వాతంత్ర్య ఫలాలు అందరికీ చేరువ కావాలి : గుంటూరు జిల్లా జనసేన ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు

    గుంటూరు, (జనస్వరం) :  స్వాతంత్ర్య ఫలాలు ప్రజలందరికీ చేరువ కావాలని జనసేన పార్టీ గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు అభిలాషించారు. బుధవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాణిక్యాలరావు మాట్లాడుతూ ఎందరో మహానుభావుల ప్రాణత్యాగ ఫలమైన స్వతంత్రాన్ని పరిరక్షించుకునే  బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి నారదాసు ప్రసాద్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం పూర్తిగా ఆమోదించబడిన రోజున గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటామని, గణతంత్రం అనగా ప్రజలే ప్రభుత్వం, ప్రభుత్వమే ప్రజలని అర్ధం అని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో పుట్టినందుకు భారతీయుడిగా ప్రతీక్షణం గర్వపడతామని అన్నారు. కార్యక్రమంలో జనసైనికులు ఆళ్ళ హరి, దాసరి వెంకటేశ్వరరావు, మహంకాళి శ్రీనివాస్, ఇల్లా శేషు, కానవరపు శ్రీనివాస్, మధులాల్, అలా కాసులు, కిషోర్, నాని తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com