
జగ్గయ్యపేట, (జనస్వరం) : కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలం లింగాల మున్నేరు వంతెనను ఎత్తులో నిర్మాణం చేపట్టాలని జనసేన పార్టీ నియోజకవర్గ నేత బాడీశ మురళీకృష్ణ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మురళీకృష్ణ మాట్లాడుతూ ఎగువున కురుస్తున్న తేలికపాటి వర్షాలకు కూడా వంతెన దిగువగా ఉండటం వలన వరదనీరు వంతెన మీద నుంచి ప్రవహించడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని, అదే విధంగా తెలంగాణ నుండి ఆంధ్రకు ముఖద్వారంగా ఉన్నటువంటి ఈ వంతెనను త్వరతిగతిన నిర్మాణం చేపట్టాలని అదే విధంగా ఇంతకు ముందు వచ్చిన వరదలకు వంతెన రహదారి పూర్తిగా కొట్టుకొని పోయి గుంతలు ఏర్పడటంతో రాత్రి వేళలో ప్రయాణం చేసే వాహనదారులు చాలా ఇబ్బందులు గురవుతున్నారని, తక్షణమే ప్రభుత్వం చొరవ తీసుకొని మునేటి వంతెన నిర్మాణాన్ని ఎత్తులో నిర్మించాలని జనసేన పార్టీ నియోజకవర్గ నేత బాడీశ మురళీకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రెగండ్ల వెంకటరామయ్య, తునికిపాటి శివ, తులసి బ్రహ్మమ్, మాధవరావు, గోపిచారి, లింగరాజు తదితరులు పాల్గొన్నారు.