బనగానపల్లి ( జనస్వరం ) : జన సైనికులను రెచ్చగొట్టేందుకు వైసిపి పార్టీకి చెందిన వ్యక్తులు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కించపరిచేలా బనగానపల్లె పట్టణంలో R&B ఆఫీస్, గవర్నమెంట్ హై స్కూలు, అవుకు మెట్ట దగ్గర ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. వాటిని వెంటనే తొలగించాలని బనగానపల్లె జనసేన పార్టీ నాయకులు భాస్కర్ ఆధ్వర్యంలో అజిత్ రెడ్డి, షేక్షావలి, శేఖర్, రాజు, శంకర్ జనసైనికులు పోలీస్ శాఖ మరియు EORD వారికి తెలియజేయడం జరిగింది. విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా శాంతి భద్రతలు భంగం కలిగేలా ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలను పంచాయతీ అధికారులతో వెంటనే తొలగించాలని లేని పక్షంలో పార్టీ తరఫున పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేయాల్సి ఉంటుందని తెలిపారు. కావున శాంతియుతంగా సమస్యను పరిష్కరించే విధంగా ఫ్లెక్సీలను తొలగించే విధంగా చేయాలని కోరడం జరిగింది. ప్రభుత్వ అధికారులు సానుకూలంగా స్పందించి ఇంతకు చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హాజీ, రాఘవేంద్ర, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com