గాజువాక ( జనస్వరం ) : మౌలిక వసతులు కల్పించిటంలో వైసిపి ప్రభుత్వం విఫలం అయ్యిందని జనసేన పార్టీ రాష్ట్ర పిఏసి సభ్యులు మరియు గాజువాక ఇంఛార్జ్ కోన తాతరావు అన్నారు. వైసిపి పాలనలో 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంపు, ఇంటి పన్నులు, త్రాగు నీరు 300శాతం పెంపు, చివరికి చెత్త మీద కూడా పన్ను వేసిన తొలి ముఖ్య మంత్రిగా చరిత్రలో మిగిలిపోతారని ఆరోపించారు. నిత్యావసర సరుకులు ధరలు ఆకాశాన్ని అంటుకుంటుంటే పేద, సామాన్య మధ్య తరగతి ప్రజలు కొనుక్కొనే శక్తిలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోవటానికి గాజువాక నియోజకవర్గ వార్డుల్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర మొదలుపెడుతున్నామని జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు గాజువాక నియోజవర్గం ఇంచార్జ్ కోన తారావు అన్నారు. 71 వార్డు జనసేన పార్టీ అధ్యక్షులు బేతు చైతన్య కృష్ణ అధ్వర్యంలో విశ్వేవరాయ నగర్, శ్రీరామ్ నగర్, సుందరయ్య కాలని, శ్రీనగర్ ప్రాంతాల్లో పాదయాత్ర కొనసాగుతుందన్నారు. ఈ పాదయాత్రలో వార్డు నాయకులు వెలిది శ్రీనివాస్, నారెండి శ్రీనివాస్, అప్పల రెడ్డి, బాబు, జనసేన పార్టీ నాయకులు కరణం కనకారావు, గడసాల అప్పారావు, తిప్పల రమణారెడ్డి, దల్లి గోవిందరెడ్డి, లంకల మురళి దేవి, యడిడ భార్గవ్, గంధం వెంకటరావు, కాద శ్రీను, మాక షాలిని, ముమ్మన మురళి, గొలగాని గోపీచంద్, చందక చిన్నారావు, గవర సోమశేఖర్, రౌతు గోవిందరావు, సంద్రాన భాస్కర్ రావు, కోన చిన అప్పారావు, గలకోటి సోమన్న, ముమ్మన మురళి, దాసరి జ్యోతి రెడ్డి, రామలక్ష్మి, ఇందిర ప్రియదర్శిని, సాడె రామారావు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com