ఒంగోలు ( జనస్వరం ) : 64వ రోజు జన చైతన్య యాత్ర 24వ డివిజన్ ఏకలవ్య నగర్ లో జరిగింది. ఈ సందర్బంగా స్థానికులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లగా ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో “ఆయాల” గా పనిచేస్తున్న మాకు కనీసం పూర్తి జీతాలు ఇవ్వటం లేదని, 16వేల కు గాను 11వేలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలానే షిఫ్ట్ డ్యూటీలు కూడా పాటించడం లేదని, పర్మినెంట్ చేస్తామని కూడా చెప్పారని ఇప్పటివరకు మమ్మల్ని పట్టించుకున్న నాథుడు లేడని, మా సమస్యలు జగన్మోహన్ రెడ్డి తీరుస్తాడని ఓటేసి మోసపోయామని అన్నారు. ఈసారి తప్పకుండా జనసేన పార్టీకి అండగా ఉంటామని తెలియజేసారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ తప్పకుండా మీ సమస్యలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏర్పాటు కాబోయే ప్రభుత్వంలో తప్పకుండా నెరవేరుస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్, ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు చనపతి రాంబాబు, కళ్యాణ్ ముత్యాల, ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పల్ల ప్రమీల, ఒంగోలు నగర జనసేన పార్టీ కార్యదర్శి గోవింద్ కోమలి, ఒంగోలు నగర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శులు పోకల హనుమంతు రావు, ఆకుపాటి ఉష, వీర మహిళ మాదాసు సాయి నాయుడు, 28వ డివిజన్ అధ్యక్షులు కోట సుధీర్ మరియు జనసేన నాయకులు చెన్ను నరేష్, జనసేవ శ్రీనివాస్, యాదల సుధీర్, ఉంగరాల వాసు, అవినాష్ పర్చూరి తదితరులు పాల్గొన్నారు.