రోడ్డు ప్రమాదంలో మరణించిన ఢిల్లీశ్వరావు కుటుంబానికి రూ. 11,000 వేల ఆర్థిక సహాయం అందించిన జనసైనికులు
ఆముదాలవలస నియోజకవర్గం, అప్పలపేట గ్రామంలో రోడ్ ప్రమాదానికి గురైన మన జనసైనుకుడు యడ్ల ఢిల్లీశ్వరావు గారికి కొత్తకోట నాగేంద్ర గారి ఆధ్వర్యంలో మన జనసైనికులు అందరూ కలిసి కట్టుగా వెళ్లి, వాళ్లు కుటుంబానికి, మన జనసేన కుటుంబం తరఫున భరోసా ఇచ్చి, అతని ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటూ, కాసేపు మౌనం పాటించారు. ఎటువంటి పరిస్థితిలో అయిన మన జనసేన కుటుంబం, వాళ్లకి తోడుగా ఉంటుంది అని భరోసా ఇవ్వడం జరిగింది. జనసేన తరుపున ఢిల్లీశ్వరరావు వాళ్ళు కుటుంబానికి నగదు రూపంలో 11000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంను ముందుండి నడిపించినటువంటి కొత్తకోట నాగేంద్ర గారికి మరియు వాళ్ల కుటుంబానికి అండగా ఉండటానికి సపోర్ట్ చేసినటువంటి జనసైనికులు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు కుటుంబ సభ్యులు. ఈ కార్యక్రమంలో అంపిలి.విక్రమ్, కోరుకొండ మల్లేశ్వరావు, కన్నబాబు గారు మరియు తదితరులు పాల్గొన్నారు.