
పాలకొండ నియోజకవర్గ బెజ్జి గ్రామంలో శివ్వాల తనుజ అనే అమ్మాయికి బోన్ క్యాన్సర్ ఉందన్న విషయం తెలియగానే పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు గారు 15 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా కుటుంబంతో మాట్లాడి తన ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడే అంతవరకు ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా పూర్తి స్థాయిలో అందిస్తామని అన్నారు. ఆ కుటుంబానికి పూర్తి భరోసా ఇవ్వడం జరిగింది. ఆ కుటుంబానికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పొట్నూరు రమేష్, గర్భపు నరేంద్ర, సాయికిరణ్, ప్రసాద్, సంపత్ కుమార్ భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.