
– పవనన్న ప్రజాబాటలో జనసేనపార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి
నెల్లూరు సిటీ, (జనస్వరం) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేనపార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమాన్ని 173వ రోజున 42వ డివిజన్ కోటమిట్ట సికందర్ కేఫ్ ప్రక్క వీధిలో జరిగింది. ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికీ తిరిగిన కేతంరెడ్డి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారం దిశగా పోరాడుతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కి అండగా నిలిచేందుకు యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధమయ్యారని, ఈ సత్యాన్ని జీర్ణించుకోలేకపోతున్న వైసీపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ కి అండగా నిలుస్తున్న వారిని, జనసేనపార్టీ నాయకులను, కార్యకర్తలను ఇబ్బంది పెట్టే చర్యలకు పాల్పడుతోందని అన్నారు. మంగళగిరిలోని ఇప్పటం గ్రామంలో పవన్ కళ్యాణ్ కి అండగా నిలిచిన ప్రజల ఇళ్ళను కూలగొట్టి పైశాచిక ఆనందం పొందిన వైసీపీ ప్రభుత్వ అంతం ఎంతో దూరంలో లేదని అన్నారు. నేడు పవన్ కళ్యాణ్ బాధితులకు అండగా నిలిచేందుకు బయలుదేరితే అడుగడుగునా పోలీసు బలగాలను పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేసారని, రాష్ట్రం శాంతిభద్రతల విషయంలో రాజ్యాంగ సంక్షోభం దిశగా పయనిస్తోందని అన్నారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల తర్వాత కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే అని, ఇప్పుడు జరుగుతున్న ప్రతి సంఘటనకి ధీటైన జవాబు ఉంటుందని కేతంరెడ్డి వినోద్ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేనపార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.