అరకు, (జనస్వరం) : అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు నియోజక వర్గంలో జనసేనపార్టీ బలోపేతమే లక్ష్యంగా పార్టీ భవిష్యత్ కార్యాచరణ కోసం నియోజకవర్గ సమన్వయ కమిటీ, మండల అధ్యక్షులు అరకు పార్లమెంట్ ఇంచార్జి డా. వంపురు గంగులయ్య ఆధ్వర్యంలో మండల కమిటీ ఎన్నిక జరిగింది. పలుకీలక అంశాలు చర్చించి పార్టీ క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం చేయడానికి కమిటీలు వేయడం జరిగిందని తెలిపారు. నియోజకవర్గంలో 13 మందితో సమన్వయ కమిటీ 6 గురుతో కూడిన ఆరు మండలాల మండల కమిటీలు వేయడం జరిగింది. రానున్న రోజుల్లో గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం చేయుటకు క్షేత్రస్థాయిలో పార్టీ సిద్ధాంతాలు, పార్టీ ఆశయాలు ప్రజల్లో తీసుకుళ్లి రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చూడాలని నిర్ణయించి కమిటీ సభ్యులందరు క్షేత్ర స్థాయిలో పని చేయాలని నియోజావర్గం సమన్వయ కమిటీ మండల అధ్యక్షులు కమిటీ ఎన్నుకోవడం జరిగిందని గంగులయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో సమన్వయ కమిటీ సభ్యులు మాదాల శ్రీరాములు, కొనెడి లక్ష్మణ్ రావు, దూరియా సాయిబాబా, బంగరు రామదాసు, ముల్లంగి శ్రీనివాస్, ప్రవీణ్, నవీన్, సురకత్తి రాంబాబు, మజ్జి కృష్ణం రాజు, కిల్లో బాబురావు, శెట్టి ఆనంద్, గంపరయి జవహర్, గోల్లోరి సతీష్ కుమార్ నియోజకవర్గ సమన్వయ కమిటీలగా ప్రకటించగా, మండల కమిటీలుగా 6 మండలాలకు గాను అల్లంగి రామ కృష్ణ, చిత్తం మురళి, కొనెడి చిన్నారవు, సుధీర్, పవన్ కుమార్, శ్రావణ్ కుమార్ ను పార్టీ మండల కమిటీలుగా ప్రకటించారు.