విజయవాడ ( జనస్వరం ) : జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్ మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన వారాహి యాత్ర విజయవంతం కావాలని ఘాట్ రోడ్డు ఎంట్రన్స్, టోల్ గేట్ వద్ద ఉన్న కామధేను అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి 108 కొబ్బరికాయలు కొట్టడం జరిగింది అనంతరం వారాహి యాత్ర కి సంబంధించి పోస్టర్ రిలీజ్ చెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా పోతిన మహేష్ గారు మాట్లాడుతూ ఈనెల 14 తారీకు నుంచి పవన్ కళ్యాణ్ గారు చేపట్టబోయే వారాహి యాత్ర విజయవంతం కావాలని అదేవిధంగా ప్రజా సమస్యలు తీరాలని రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలని ఈ రాష్ట్రానికి రాజధాని రావాలని వైసిపిముక్తాఆంధ్ర ప్రదేశ్ కేవలం పవన్ కళ్యాణ్ గారు వల్లే సాధ్యమని ఎప్పుడైతే ఈ రాష్ట్రం నుంచి వైసీపీ ప్రభుత్వాన్ని పారధోలతామో అప్పుడే ఈ రాష్ట్రంలో ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందుతాయని అవినీతి పూర్తిస్థాయిలో ప్రక్షాళన జరుగుతుంది అని అదే విధంగా ఈ రాష్ట్రానికి పరిశ్రమలు పెట్టుబడులు వస్తాయని తద్వారా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే గొప్ప సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి వారాహి యాత్ర విజయవంతం కావాలి అమ్మవారి పాదాలు చెంత 108కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేయడం జరిగిందని, వారాహికి ఎటువంటి అడ్డంకులు అవాంతరాలు ఉండకూడదని యాత్ర సజావుగా సాగాలని అమ్మవారిని జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు మనస్పూర్తిగా ప్రార్థించామని అదేవిధంగా మాతో పాటుగా శైవ క్షేత్రం నుంచి స్వామీజీలు వచ్చి పవన్ కళ్యాణ్ గారి యాత్ర విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు చేయడం జరిగిందని వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అని అదేవిధంగా రాష్ట్రంలో వైసిపి నాయకులు సభలు సమావేశాలు పెట్టుకున్నప్పుడు లేనటువంటి ఆంక్షలు జనసేన పార్టీ నాయకులు సమావేశాలు పెట్టినప్పుడు ఎందుకు గుర్తుకొస్తున్నాయని మీరు ఈ సమయంలో సెక్షన్ 30 అమల్లోకి తీసుకొచ్చినంత మాత్రాన ఈ యాత్రకు ఎటువంటి అడ్డంకులు సృష్టించలేరని జనసేన సైనికులకి నాయకులకి వీర మహిళలకి పోలీసులంటే భయం లేదని జైళ్లు అంటే ఆందోళన లేదని కత్తిపూడి సభకి ఎటువంటి అడ్డంకులు సృష్టించిన వాటిని దాటుకుని లక్షలలో వెళ్లి వారాహి యాత్రను విజయవంతం చేస్తాం అని వైసిపి పతనం కూడా కత్తిపూడి సభ నుంచే ఆరంభం అవుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నానని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యాన్ని కూని చెయ్యాలని చూస్తే ఉపేక్షించేది లేదని మీరు జీవో నెంబర్ ఒకటి తీసుకొస్తే హైకోర్టు కొట్టేసిందని మీరు ఇవన్నీ మర్చిపోయి నియంతృత్వ పాలన చేయాలనుకుంటే మీరు మీకు ఇచ్చినటువంటి ఐదేళ్ల పరిపాలన గడువు పూర్తి కాకముందే ప్రజా వ్యతిరేకత వస్తుందని ప్రజలు మిమ్మల్ని తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాని మాట్లాడడం జరిగింది.ఈ కార్యక్రమంలో శైవ క్షేత్రం నుంచి స్వామీజీలు హనుమత్ స్వామి. ఆత్మానంద స్వామి. సాయిసత్యానంద యోగి స్వామిగీ, , డివిజన్ అధ్యక్షులు పోట్నురి శ్రీనివాసరావు, కొరగంజి వెంకటరమణ, మల్లేపు విజయలక్ష్మి, తిరుపతి అనూష బొమ్మ రాంబాబు ,రాము గుప్త, రెడ్డిపల్లి గంగాధర్., గన్ను శంకర్, వెన్నా శివశంకర్,కామల సోమనదం, బొలిశెట్టి వంశీకృష్ణ, ముద్దాన స్టాలిన్ శంకర్, మొబీనా, రావి సౌజన్య , , పాల రజిని, సాబిన్కర్ నరేష్, గంజి పవన్, శిరీష ,శనివారపు శివ, బుద్ధున ప్రసాద్, కూర్మా రావు, కొలిచేరి రమేష్, బొట్టు రవి, బొట్టా సాయి, తదితరులు పాల్గొనడం జరిగింది.