తిరుపతి ( జనస్వరం ) : అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్-(APTA) 2023 -24 సంవత్సరానికి గాను స్కాలర్షిప్స్ పొందిన తిరుపతి జిల్లాలో బాగా చదువుకుంటు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు చెక్కులు అందచేసిన డా.పసుపులేటి హరిప్రసాద్ . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంతకుముందు అనుకునేవారు పాతకాలంలో పెద్దలు తమ పిల్లలకు తరతరాలకు సరిపోయేలాగా ఆస్తిపాస్తులను సంపాదించుకునేవారు, కానీ నోటికో కోటికో ఒకరు ఉంటారు వారు తరతరాలకు సంపాదిస్తే రెండవ తరానికి గుర్తుండము ఏమైనా చేద్దాం ఈ తరానికే అనేలా కొందరే ఉంటారు. ఎవరైతే ఈ సమాజంలో ప్రజలకు సేవ చేయాలి అనుకుంటారో వాళ్లలో కొంతమంది నియోజకవర్గ స్థాయిలో చేస్తారు, జిల్లా స్థాయిలో కొంతమంది చేస్తారు రాష్ట్ర స్థాయిలో కొంతమంది చేస్తారు దేశం స్థాయిలో కొంతమంది చేస్తారు. ఇలా సాయం చేసేవాళ్ళని వారు మరణించిన వారి పేరు తలుచుకుంటారు. మనం చేసే పని మన స్వార్ధం కోసం కాకుండా ప్రజలకోసం చేయాలి ఆలా చేస్తే జిల్లా, రాష్ట్ర దేశం అన్ని మన చేసిన గొప్ప గురించి మాట్లాడుకుంటారు. APTA చైర్మన్ కొట్టె ఉదయ్ భాస్కర్ గారు, APTA సభ్యులు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తూ వారికీ ఎంతో సహాయం చేస్తున్న వారికి తిరుపతి APTA నుంచి ధన్యవాదములు తెలియచేస్తున్నాము. ఈ కార్యక్రమంలో Prof. దేపూరు భారతి గారు, వైస్ ఛాన్స్లర్, శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ, శ్రీమతి తిరుమల నారాయణమ్మ గారు, శ్రీ పద్మావతి ఉమెన్స్ డిగ్రీ & పీజీ కాలేజ్ ప్రిన్సిపల్ , Prof. కడియాల హరిబాబు గారు, Rtd. Dean, S.V.అగ్రికల్చరల్ కాలేజ్, Prof. నగరం వినోద్ కుమార్ గారు S.V. వెటర్నరీ యూనివర్సిటీ, శ్రీమతి పెనుమాదు సులోచన గారు, శ్రీ పద్మావతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, శ్రీ కొట్టే రాజగోపాల్ గారు బిజినెస్‌మాన్ పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com