సముద్ర కరకట్టకు ఉన్న రక్షణ గేట్లు వెంటనే బాగుచేయించాలి. అవనిగడ్డ నియోజకవర్గం జనసేన పార్టీ డిమాండ్

సముద్ర కరకట్ట

       అవనిగడ్డ, (జనస్వరం)  :   కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం. ప్రస్తుతం అవనిగడ్డ నియోజకవర్గముకు సముద్ర కరకట్టకు రక్షణ గేట్లు పూర్తిగా పాడు అయిపోయి రైతులు, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సముద్ర కరకట్టకు బ్రిటిష్ కాలంలోనే రక్షణ గేట్లు ఏర్పాటు చేసినారు. అయితే 1977 లో ఆ గేట్లు దెబ్బ తిన్నపుడు, 1979 లో నీటిపారుదల శాఖ పర్యవేక్షణలో నూతనంగా ఆటోమేటిక్ లాక్ సిస్టం ఏర్పాటు చేసి, అధిక వర్షాలు వచ్చినప్పుడు గ్రామాలలోని వర్షపు నీరు, మురుగునీరు, పంటపోలలోని నీరు కోడూరు మండలం లోని లింగన్న కొడు, రత్నా కొడు ద్వారా పాలకాయతిప్పా, సంగమేశ్వరం వద్ద ఉన్న లాక్ సిస్టం ద్వారా సముద్రంలో కలిసే విధంగా ఈ గేట్లు ఏర్పాటు చేసినారు. వర్షపు నీరు, మురుగు నీరు సముద్రం లో కలవడానికి, సముద్రం నీరు ఈ రెండు కొడులో కలవకుండా ఉండటం కోసం ఈ ఆటోమేటిక్ సిస్టం లాక్ సిస్టం ఏర్పాటు చేసినారు. గత కొన్ని ఏళ్ళ నుండి ఈ ఆటోమేటిక్ సిస్టమ్ చెడిపోవటం జరిగింది. మా జనసేన పార్టీ అనేక సార్లు అధికారులుకు, పాలకులకు చెప్పినా ఫలితం శూన్యం. ఈ ఆటోమేటిక్ సిస్టమ్ చెడిపోవుట వలన, అధిక వర్షాలు, వరదలు వచ్చినప్పుడు రైతులు, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. సముద్రం నీరు కూడ ఈ లాక్ లు ద్వారా కొడులు లోకి వచ్చి పంటపొలాలు మునిగిపోయి, వరి పొలాలు సైతం సౌడు పొలాలుగా మారి పోతున్నాయి. ఈ పరిస్థితి వలన సముద్ర తీరప్రాంత ప్రజలు, రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. రాజకీయ నాయకులు ఈ సమస్యను కేవలం ఎన్నికలు అప్పుడు కేవలం ఓటు బ్యాంక్ రాజకీయం కోసం వాడుకుంటున్నారు తప్పా, అధికారంలోకి వచ్చిన తరువాత ఈ సమస్యను  గాలికి వదిలి వేస్తున్నారు. ఈ సముద్ర రక్షణ గేట్లు పర్యవేక్షణ 2020 వరకు నీటి పారుదల శాఖ వారు తీసుకోని, ఇప్పుడు ఈ సమస్య మాదికాదు, డ్రైనేజీ శాఖది అనీ పూర్తిగా నిర్లక్ష్యం చెయ్యటం చాలా బాధాకరం. ఈ లాక్ సిస్టం బాగుచేయించాలని  మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నివార్ తుపాన్ పర్యటనకు వచ్చినప్పుడు ప్రభుత్వంను డిమాండ్ చెయ్యడం  కూడా జరిగింది. అధికారులు గానీ, పాలకులు గానీ ఈ సమస్య గాలికి వదిలి వెయ్యడం భావ్యం కాదు. కావున అధికారులు, పాలకులు వెంటనే స్పందించి ఈ ఆటోమేటిక్ లాక్ సిస్టం బాగుచేయించాలి అనీ జనసేన పార్టీ తరుపున పులిగడ్డ లో నీటిపారుదల శాఖ DE గారి ఆఫీస్ నందు సీనియర్ అసిస్టెంట్ ఉదయభాస్కర్ గారిని కలిసి పరిస్థితి వివరించి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. సమస్య పరిస్కారం కాకపోతే మరల పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి వివరించి ఆయన అనుమతితో ప్రజా ఉద్యమం చెయ్యటం జరుగుతుంది అనీ ప్రభుత్వంకు హెచ్చిరిస్తున్నాము.  ఈ కార్యక్రమం లో జనసేన నాయకులు రాజనాల వీరబాబు, తోట ఆంజనేయులు, పప్పుశెట్టి శ్రీనివాస్ రావు, అనిల్ కుమార్, తుంగల నరేష్ , రవి, చందు జనసేన పార్టీ  వీరామహిళలు మక్కిన విజయకుమారి, అవనిగడ్డ గ్రామపంచాయతీ జనసేన పార్టీ వార్డ్ మెంబెర్ శ్రీ లక్ష్మి గారు, నాయకులు మడమల రంజిత్ కుమార్, పసుపులేటి రవి కుమార్, తోట మురళి కృష్ణ, లంక రవి, సాయి సుజిత్, రైతుసోదరులు కృష్ణారావు, R. రవి, కొండలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way