రాజంపేట ( జనస్వరం ) : రాజంపేట నియోజకవర్గ జనసేన ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజా సాధికారత యాత్ర కాదని విమర్శించారు. సామాన్యులను వేధించిన యాత్ర.. ప్రజాసొమ్మును కోట్లాది రూపాయల ఖర్చులు చేసి సామాన్య ప్రజలకు నిరుపయోగమైన యాత్ర వైసీపీ రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ప్రజాగ్రహం ముందర ఓటమి భయం పట్టుకుందని అన్నారు. ఈ చివరి యాత్రతోనైనా బల నిరూపణ కోసం స్థానిక ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి చేపట్టిన మోసపూరిత యాత్ర కోసం చుట్టుపక్కల నుంచి ప్రతి గ్రామ మండల స్థాయి ప్రభుత్వ అధికారులు ఎంపీడీవోలు, యానిమేటర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, వాలంటీర్లును ఒత్తిడి చేసి ఆరు మండలాల నుంచి ప్రభుత్వం మీటింగ్ పేరుతో వైసీపీ నాయకులు రాజకీయ ఉనికి కోసం ప్రజలను యాత్రకు ప్రజా సేకరణ చేయడం సిగ్గుచేటు అన్నారు. రాజకీయ స్వలాభం కోసం పాత బస్టాండ్ లో ట్రాఫిక్ స్తంభింపజేయడంతో ఉదయం నుండి సాయంత్రం వరకు ఆటోలు వాహనాలు రాకపోకలు నిలిచిపోయి ఇబ్బంది పడ్డారు. సామాన్య ప్రజలు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాగ్రహం ముందు వైసీపీని గద్దె దింపి జనసే, టీడీపీ ద్వారా ఉమ్మడి సరికొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి కడపజిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు కత్తిసుబ్బారాయుడు, సీనియర్ నాయకుడు భాస్కర్ పంతులు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com