
అనంతపురం ( జనస్వరం ) : అరాచక వైసిపి ప్రభుత్వానికి పాడి కట్టి సమాధికి, గాలి సీఎం జగన్ జైలుకి పంపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని శింగనమల జనసేన పార్టీ సీనియర్ నాయకులు దంపేట్ల శివ హెచ్చరించారు. పత్రికా ముఖంగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పేరు వింటేనే సైకో జగన్ రెడ్డికి చలి జ్వరం వస్తుందన్నారు. అధికారంలోకి వచ్చిన నాలుగున్నర సంవత్సరాల కాలంలో అభివృద్ధి, సంక్షేమాన్ని పక్కన పెట్టి అరాచకాలు, విధ్వంసాలు, అక్రమాలకు పాల్పడుతూ పాలన చేస్తున్న జగన్ రెడ్డి సీఎం అని చెప్పుకునేందుకు ప్రజలు సిగ్గుపడుతున్నారని అపహాస్యం చేశారు. ప్రభుత్వం డబ్బుతో సభలు పెట్టి చేసిన సంక్షేమం, అభివృద్ధి కోసం చెప్పుకోవలసిన జగన్ రెడ్డి పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. రాజ్యాంగబద్ధంగా, న్యాయబద్ధంగా వివాహాలు చేసుకున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సైకో జగన్ రెడ్డికి హితవుపలికారు. జగన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలకు రక్షణ కరువైందని, మహిళలపై రోజురోజుకు అగత్యాలు, అత్యాచారాలు, హత్యలు, అరాచకాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను కించపరిచే విధంగా జగన్ రెడ్డితోపాటు అతని మంత్రివర్గ సభ్యులు కూడా మాట్లాడుతున్నారన్నారు. జగన్ రెడ్డికి కూడా తల్లి, చెల్లి, భార్య ఉన్నారని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. రోడ్లమీద నడవకుండా, రోడ్లమీద తిరగకుండా గాలిలో తిరిగే గాలి సీఎం జగన్ గాలి మాటలతో కాలం గడుపుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ నియంతలా వ్యవహరిస్తూ నిత్యం అబద్దాలు వల్లిస్తూ, హింసలకు పాల్పడుతూ, వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నాడని ఆరోపించారు. పరిపాలన చేతకాని, నికృష్టమైన, మానసిక స్థితులేని జగన్ రెడ్డి ప్రభుత్వానికి గోరి కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, 2024లో జరిగే ఎన్నికల్లో వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా రాదని తెలిపారు.