Search
Close this search box.
Search
Close this search box.

వైసీపీకి చరమ గీతం పాడే రోజులు దగ్గరపడ్డాయి

వైసీపీ

     రాజంపేట ( జనస్వరం ) : వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలోని ప్రజలు విసిగిత్తిపోయారని వైసిపికి చమర గీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని రాజంపేట జనసేన పార్టీ ఇన్చార్జి మలిశెట్టి వెంకటరమణ పేర్కొన్నారు. వీరబల్లి మండలంలోని బొంగులపల్లి హరిజనవాడ, పోలి చెన్నా రెడ్డి గారి పల్లి, పిట్ట బజార్ , వక్కలగడ్డ, ఈడిగపల్లె పలు గ్రామాలలో 132వ రోజు పవనన్న ప్రజా బాట కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేస్తూ,వాటిని ప్రజలకు వివరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండలంలోని ప్రజలు జనసేన తెలుగుదేశం పార్టీకి ప్రజలు నీరాజనాలు అర్పిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజలు జగన్ రెడ్డి పరిపాలన విసుగెత్తి ఎన్నికలు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్నారన్నారు.రాష్ట్రంలోఏ ఒక్క కంపెనీ కూడా రాకుండా చేశారన్నారు.ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 10 లక్షల కోట్లు అప్పుచేసి ప్రజల మీద తలభారం మోపి ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారన్నారు . ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం తగదన్నారు.2024 ఎన్నికల్లో ఎక్కడ అన్యాయం,అక్రమాలు జరిగినా ప్రజలే వాలంటీర్లుగా మారాలన్నారు.రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీని ఆదరించాలన్నారు ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య, చౌడయ్య, జయరామయ్య, స్వామి, జనసేన వీర మహిళలు పోలిశెట్టి రజిత, శిరీష, మాధవి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way